- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజూ ఉదయం ఒక చెంచా నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలా..
దిశ, ఫీచర్స్ : సాంప్రదాయ భారతీయ వంటల్లో, స్వీట్ల తయారీలో ఎక్కువగా నెయ్యి వాడుతుంటారు. నెయ్యిలో ఉండే కమ్మదనం తో స్వీట్స్ రుచికరంగా ఉంటాయి. ఈ నెయ్యి మనిషికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. స్వీట్స్ లో మాత్రమే కాదు ప్రతి రోజూ ఉదయం ఒక చెంచా నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నెయ్యిని ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పరిగడుపున నెయ్యితింటే మలబద్ధకం, అధిక రక్తపోటు, ఇన్ఫ్లమేటరీ ప్రేగు సిండ్రోమ్, గుండె జబ్బులు, పిసిఒఎస్, బలహీనమైన కీళ్ళ వ్యాధి ఉన్నవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఎ, డి, ఇ, కె విటమిన్ లు ఉన్నాయి. రోజు ఉదయం నెయ్యిని తీసుకోవడం వలన బరువు పెరగకుండా నియంత్రిస్తుందని చెబుతున్నారు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండిన భావాన్ని కలిగించి ఆకలిని కంట్రోల్ చేస్తుందని చెబుతున్నారు. నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే మెదడు చురుకుగా పని చేస్తుందని చెబుతున్నారు.
అలాగే కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడంలో నెయ్యి ఎంతగానో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే శీతాకాలంలో నెయ్యి తీసుకోవడం వలన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుందట. చర్మం పొడిబారకుండా కాంతివంతంగా చేసేందుకు ఉపయోగపడుతుందట. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.