- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral video: అలాంటి ఇండియన్ వరుడైతేనే పెళ్లి చేసుకుంటానంటున్న రష్యన్ యువతి.. కాకపోతే..!
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రేమ, పెళ్లి వంటి విషయాలను చర్చించడానికి, తమ అభిప్రాయాలను వెల్లడించడానికి వ్యక్తుల మధ్య కొంత నేరుగా పరిచయం ఉంటే తప్ప సాధ్యం అయ్యేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. సోషల్ మీడియా వేదికగా తమ జోడీలను సెలెక్ట్ చేసుకోవడం, నచ్చితే ఏమాత్రం మొహమాటం ప్రపోజ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అలాగే తమకు ఎలాంటి వ్యక్తి భర్తగా లేదా భార్యగా కావాలో చెప్తూ కొందరు ఓపెన్‌గా పోస్టులు సైతం చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. ఇక్కడ ఓ రష్యన్ యువతి తనకు పెళ్లి చేసుకోవడానికి ఇండియన్ వరుడు మాత్రమే కావాలంటూ కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. ఆ వివరాలేంటో చూద్దాం.
వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. దుబాయ్‌లో నివసిస్తున్న నెల్లీ అనే రష్యన్ యువతి ఇటీవల వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాగా ఇందులో ఆమె తాను పెళ్లి చేసుకునేందుకు ఇండియన్ వ్యక్తికోసం వెతుకుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక తన జీవితంలోకి ప్రవేశించే వ్యక్తి తప్పకుండా ఆరడుగుల అందగాడై, సంగీత ప్రియుడై ఉండాలని పేర్కొన్నది. అంతేకాకుండా అతనికి డ్యాన్స్ వచ్చి ఉండాలని, ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టపడాలని తెలిపింది. మరో విషయం ఏంటంటే అతను ఇండియాను, తనను మాత్రమే కాకుండా రష్యాను కూడా ప్రేమించాలని కండిషన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో @ girl-white -indian అనే యూజర్ ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.