Eye Makeup : కనురెప్పలను అందంగా తీర్చిదిద్దగలిగే ప్రయత్నం.. కానీ ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ ముప్పు తప్పదు

by Sujitha Rachapalli |
Eye Makeup : కనురెప్పలను అందంగా తీర్చిదిద్దగలిగే ప్రయత్నం.. కానీ ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ ముప్పు తప్పదు
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది అమ్మాయిలు ముఖంతోపాటు తమ కళ్లను మరింత అందంగా ముస్తాబు చేసుకుంటారు. ఐ మేకప్ కారణంగా అట్రాక్టివ్ గా కనిపిస్తామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఐ మేకప్ ఫాలో అవుతారు. దీంతోపాటు కనురెప్పలు పొడవుగా కనిపించేందుకు ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ వాడుతుంటారు. కానీ దీనివల్ల దృష్టి కోల్పోయే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వీటిలో వాడే కెమికల్స్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉందని చెప్తున్నారు.

నిజానికి కనురెప్పలు కంటిలో దుమ్ము ధూళి పడకుండా అడ్డుకుంటాయి. కానీ మనం సిల్క్, ప్లాస్టిక్, నైలాన్, గుర్రం వెంట్రుకలతో తయారు చేసిన వెంట్రుకలను ఉపయోగించి తయారు చేసిన ఆర్టిఫీషియల్ కనురెప్పలు అటాచ్ చేస్తున్నాం. వీటిలో ఉన్న దుమ్ము, కెమికల్స్ మన కంటిలోకి చేరేలా చేస్తున్నాం. పైగా వీటిని కనురెప్పలకు అటాచ్ చేసేందుకు ఉపయోగించే గ్లూ.. 40 శాతం మంది మహిళల్లో అలెర్జీకి దారితీస్తుంది. 60 శాతం మందిలో ఒకేసారి కండ్లకలక, కార్నియాలో వాపుకు కారణమవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతున్నాయి. ప్రొఫెషనల్ గ్లూస్ కూడా క్యాన్సర్ కారక రసాయనమైన ఫార్మాల్డిహైడ్‌ను కలిగి ఉన్నట్లు తాజా అధ్యయనం కనుగొంది. ఇందులో ఉండే ప్రిజర్వేటివ్స్... కండ్లకలకతో పాటు కంటి చూపును ప్రభావితం చేస్తాయి. నొప్పిని కలిగిస్తాయి.

ఐ లాష్ ఎక్స్ టెన్సషన్ సమయంలో సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడే బ్యాక్టీరియా కనురెప్పల వాపు, చికాకు కలిగిస్తుంది. కొంతమంది ప్రోస్టాగ్లాండిన్ కలిగి ఉన్న హెయిర్ సీరమ్‌లను కూడా ఉపయోగించడం ప్రారంభించారు. ఈ సీరమ్‌లు కనురెప్పల మందం, పొడవు, బ్లాక్ నెస్ ను సహజంగా పెంచుతాయనే విషయం స్ప్రెడ్ అయింది. కాబట్టి వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ఇవి కళ్ల చుట్టూ ఉన్న కొవ్వు కణజాలాలను కోల్పోయేలా చేయగలవు. కనుపాపల రంగు శాశ్వతంగా మార్చగలవు.

Advertisement

Next Story

Most Viewed