మగవాళ్లు లోదుస్తులను ధరిస్తున్నారా.. ఇలా చేయకపోతే ఆ విషయంలో ఇక కష్టమే..

by Jakkula Samataha |
మగవాళ్లు లోదుస్తులను ధరిస్తున్నారా.. ఇలా చేయకపోతే ఆ విషయంలో ఇక కష్టమే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో సంతానంలేమి ఒకటి. అయితే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి అనేక వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా చేసిన న్యూ స్టడీలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి వారి లో దుస్తులు కూడా కారణం అవుతున్నాయని తేల్చి చెప్పింది ఓ సర్వే.

అయితే తక్కువ స్పెర్మ్, కదలిక లేకపోవడం, పేలవమైన స్పెర్మ్ ఇలా పలు కారణాల వలన సంతానంలేమి సమస్యలు వస్తుంటాయి. ఇది లైంగిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే బిగుతైన లోదుస్తులు ధరించడం వలన స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందంట. ఎందుకంటే? పురుషులలో వృషనాలలో సెమిని ఫెరస్ ట్యూబుల్స్ ఉంటాయి. ఇవి సెర్మ్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వాటిని ప్రభావితం చేసేలా లో దుస్తులు ఉండకూడదంట. అవి ఆరోగ్యకరమైన స్పెర్మ్ ను ఉత్పత్తి చేయాలంటే రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత కావాలి. కానీ బిగుతైన లోదుస్తులు ధరించడం వలన వాటికి ఉష్ణోగ్రత సరిగా లేకపోవడం వలన స్పెర్మ్ పై ఎఫెక్ట్ పడుతుంది. అందువలన బాక్సర్ తరహా లోదుస్తులు వాడటం మంచిది. ఈ రకమైన లోదుస్తులను ధరించినప్పుడు, వెంటిలేషన్ ఉంటుంది, కాబట్టి వృషణాలు చల్లగా ఉంటాయి. ఇది సెమినిఫెరస్ ట్యూబుల్స్‌కు నష్టం జరగకుండా చేస్తుంది. దీని వలన ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story