పాజిటివ్ థింకింగ్..అంతా మన మంచికే..

by Jakkula Samataha |   ( Updated:2024-03-15 08:14:39.0  )
పాజిటివ్ థింకింగ్..అంతా మన మంచికే..
X

దిశ, ఫీచర్స్ : పాజిటివ్‌గా ఆలోచిస్తే మన లైఫ్‌కూడా పాజిటివ్‌గా ఉంటుంది అంటారు. కానీ కొంత మంది ప్రతి విషయాన్ని నెగిటివ్‌గా తీసుకొని సమస్యల్లో చిక్కుకుంటారు.అందుకే ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి అంటారు మానసిక నిపుణులు.

మనం మన జీవితంలో సక్సెస్ కావాలంటే సాధాన , హార్డ్ వర్క్ ఎంత అవసరమో, పాజిటివ్ థింకింగ్ కూడా అంతే అవసరం. ఆల్ ఈజ్ వెల్.. అంతా మన మంచికే అనుకుంటే మంచే జరుగుతుంది. కానీ ఎప్పుడూ నెగిటివ్‌గా ఆలోచించే వ్యక్తికి నెగిటివే జరుగుతోంది. అలాంటి వారిని ఏ ఔషధం బాగు చేయలేదు. కానీ పాటిజివ్‌గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు.పాజిటివ్ ఆలోచనలు మీలో శక్తి నింపితే, నెగిటివ్ ఆలోచనలు మీలో నీరసాన్ని నింపుతాయి. మీరు ఏమి సాధించలేరని కుంగదీస్తాయి. ఏ వ్యక్తి అయితే నిత్యం పాజిటివ్ ఆలోచనలతో ఉంటారో ఆ వ్యక్తిని ఏ ఓటమి కుంగ తీయలేదు.ఆయన తన సక్సెస్ కోసం పోరాటం చేస్తాడు కానీ, నాకేదో జరుగుతుందని భయపడి సక్సెస్ కోసం చేసే పోరాటాన్ని ఆపడు. ఒక వేళ అతను నెగిటివ్‌గా ఆలోచించి తన గమ్యం కోసం చేసే ప్రయత్నాన్ని ఆపితే ఇక తాను జీవితంలో సక్సెస్ కాలేడనే అర్థం చేసుకోవాలి. అందువలన నెగిటివ్ ఆలోచనలను వదిలేసి, పాజిటివ్‌గా థింక్ చేయాలి. ఇదే మనకు మంచి స్నేహితులను, మనం కోరుకునే సక్సెస్‌ను, ప్రశాంతతను ఇస్తుంది. మరి ఇంకెందుకు లేటు మీలోని నెగిటివ్‌ను వదిలేసి పాజిటివ్‌నెస్‌ను పెంపొందించుకోండి.

Read More..

ఆ లోపంతో బాధపడుతున్న 90 శాతం మంది స్త్రీలు.. కాసేపు సమయం కేటాయించలేకే ఇదంతా..

Advertisement

Next Story

Most Viewed