- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కుక్కలతో ఆ పని ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దిశ, వెబ్‌డెస్క్ :నేటి యువత కొత్త ఆలోచనలకు నాంది పలుకుంది. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది.అలా అని అందరి మాదిరిగా రొటీన్ వ్యాపారాలు చేయడం లేదు. చేసే వర్క్ వైవిధ్యంగా.. క్రియేటివిటీ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. టీ స్టాల్ నుంచి ఆన్‌లైన్ యాప్‌ల వరకు నూతనత్వాన్ని తీసుకొస్తున్నారు. ఈ తరహ యువతే ఇప్పుడు కుక్కల బ్రీడింగ్ బిజినెస్‌ను విస్తృతంగా చేస్తుంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఒకటికి రెండు కుక్కలను పెంచుకోవడం స్టేటస్‌గా భావిస్తున్నారు. వాటికి స్పెషల్‌గా బెడ్ రూంలు, ఫుడ్, డాక్టర్ ఇలా సకల ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని క్యాష్ చేసుకుంటుంది నేటి యువత. కుక్కల పెంపకం చేపట్టి వాటిని విక్రయిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే కొందరు అవగాహన లేకుండా ఆ బిజినెస్‌లోకి దిగి నష్టపోతున్నారు. అలాంటి వారు ఈ కింది సూచనలు పాటిస్తే లాభాలు అర్జించవచ్చు. అవేంటో చూద్దాం.
కుక్కల జాతులు :
కుక్కల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడం అంత ఈజీ కాదు. దానికి కచ్చితమైన ప్రణాళిక, కుక్కల జాతుల గురించి క్షుణ్నంగా తెలిసి ఉండాలి. అలాగే మన దేశంలో కుక్కల కోసం రూపొందించిన చట్టాలు, నిబంధనలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. వివిధ కుక్క జాతులు, వాటి లక్షణాలు, వాటి స్వభావాలు, ఆరోగ్య అవసరాలు గురించి తెలుసుకోవాలి. స్థానికంగా ఉన్న డిమాండ్, ప్రజల ఆసక్తిని గమనించాలి. సంతానోత్పత్తికి వీలుండే జాతులను ఎంచుకోవాలి. కుక్కల పెంపకం దారుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకోవడంతోపాటు ట్రైనింగ్ తీసుకుంటే బెటర్. కుక్కల పెంపకానికి విశాలమైన కెన్నల్స్‌తో ప్రత్యేక స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. సరైన వెంటిలేషన్, పారిశుధ్యం, భద్రతను అందించాలి.
జాతి ఎంపిక :
మంచి స్వభావం, జాతి లక్షణాలతో సంతానోత్పత్తికి ఆరోగ్యకరమైన కుక్కలను ఎంచుకోవాలి. కుక్కలు వంశపారపర్యమైన వ్యాధులు, సంతానానికి సంక్రమించే వ్యాధులను విముక్తి పొందాయని నిర్ధారించడానికి ఆరోగ్య, జన్యు పరీక్షలు చేయించాలి. కుక్కల పెంపకం కోసం మీ రాష్ట్రం, మున్సిపల్ ప్రాంతాల్లో ఉండే చట్టాలు, నిబంధనలు తప్పని సరిగా తెలుసుకోవాలి. కుక్కల బ్రీడింగ్‌కు అనుమతులు, లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందాలి. అలాగే జంతు సంక్షేమ చట్టాలకు లోబడి ఉండాలి. సరైన పోషకాహారం, వెటర్నరీ డాక్టర్ ద్వారా వైద్యం అందించడం, కుక్కలకు సరైన జీవన పరిస్థితులను కల్పించే బాధ్యతలను నిర్వర్తించాలి. నెట్ వర్క్‌ను విస్తరించడం తప్పనిసరిగా చేయాలి. తరచూ డాగ్ షోలకు వెళ్లడంతోపాటు మీ వద్ద ఉన్నవాటిని ప్రదర్శించాలి.
కుక్కల మార్కెటింగ్ :
ఏ వస్తువునైనా మార్కెటింగ్ ద్వారానే విక్రయాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే సూత్రం కుక్కలకు కూడా వర్తిస్తుంది. మార్కెటింగ్ స్కిల్స్‌ను పెంచుకోవడంతోపాటు విస్తృతంగా ప్రచారం కల్పించుకోవాలి. మీ బ్రీడింగ్ స్టాక్, అందుబాటులో ఉన్న కుక్కలను ప్రదర్శించడానికి వెబ్‌సైట్‌ను సృష్టించడం ఉత్తమం. సోషల్ మీడియా ప్లాట్ పామ్‌లను విరివిగా ఉపయోగించుకోవాలి. ఆన్‌లైన్ డాగ్ బ్రీడింగ్ కమ్యూనిటీల్లో పాల్గొనాలి. బాధ్యతయుతమైన కస్టమర్లకే కుక్కలను విక్రయించాలి. కుక్కల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటి జాతి అభివృద్ధి కోసం సంతానోత్పత్తిని చేయించాలి. అనువజ్ఞులైన కుక్కల పెంపకం దారులు, వైటర్నరీ డాక్టర్లు, అడ్వకేట్స్‌తో కలిస్తే కుక్కల బ్రీడింగ్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించవచ్చు.
Also Read: ఇక శనిగ్రహంపైనా జీవించవచ్చు.. ఎలా సాధ్యమో తెలుసా?