- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘మహా’ గెలుపు కోసం టీబీజేపీ క్యాంపెయిన్
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఈ ఎన్నికల్లో గెలుపు కీలకంగా మారింది. గతంలో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి చెందిన శివసేన పార్టీ రూల్ చేసింది. అయితే ఈసారి సొంతంగానే గెలవాలని కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తోంది. చివరకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా ఎన్డీఏ భాగస్వామ్యంతో అయినా అక్కడ పార్టీని స్ట్రాంగ్‌గా చేసుకోవాలని స్కెచ్ వేసింది. అయితే ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ కమల దళం ప్రచారానికి తెలంగాణ నేతలను సైతం రంగంలోకి దింపింది. తెలుగు ప్రభావిత ప్రాంతాల ఓటర్ల కోసం వారిని ప్రచారానికి వెళ్లాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో పలువురు నేతలు మహారాష్ట్రకు తరలివెళ్లారు.
‘మహా’ గెలుపు కోసం టీబీజేపీ లీడర్ల క్యాంపెయిన్
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎలక్షన్స్ నేపథ్యంలో తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారానికి తెలంగాణ బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర లీడర్లు ప్రచారానికి వెళ్లాలని హైకమాండ్ ఆదేశించింది. దీంతో పలువురు నేతలు ఇప్పటికే వెళ్లి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగస్వాములయ్యారు. తెలంగాణకు సమీపంలో ఉన్న జిల్లాల్లో వారి పర్యటనలు ఉండేలా, తెలుగు ప్రజల ఓట్లను ఆకర్షించేలా తెలంగాణ నేతలతో ప్రచారం చేయించనున్నారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలయిన వార్ధా, చంద్రపూర్ ప్రాంతాల్లో టీబీజేపీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు.
చివరికి విజయం ఎవరిని వరించెనో?
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు టీ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ చంద్రశేఖర్ తివారికి పార్టీ అప్పగించింది. తెలంగాణకు చెందిన దాదాపు 10 మందికి పైగా నేతలను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పంపించారు. అందులో పలువురు ఇప్పటికే ప్రచారంలో భాగస్వాములవుతుండగా కొందరు వెళ్లలేదని సమాచారం. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు సంస్థాగత ఎన్నికల రాష్ట్ర రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు కేటాయించడంతో ఆయన వెళ్లలేదని తెలుస్తోంది. పార్టీ ప్రకటించిన జాబితా కాకుండా మాజీ ఎంపీలు బీబీ పాటిల్, చాడ సురేశ్‌రెడ్డి ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది చూడాలి.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లింది వీరే..
జిల్లా సెగ్మెంట్ నాయకుడు
- వార్ధా వార్ధా ఎమ్మెల్యే పాయల్ శంకర్
- వార్ధా దేవ్‌లీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి
- వార్ధా హింగణ్‌ఘాట్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ (వెళ్లలేదు)
- చంద్రపూర్ రాజురా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
- చంద్రపూర్ చంద్రపూర్ ఎంపీ గోడెం నగేశ్
- చంద్రపూర్ బళ్లార్‌పూర్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
- చంద్రపూర్ వరోరా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
- గడ్చిరోలి ఆర్మరీ అల్జాపూర్ శ్రీనివాస్
- గడ్చిరోలి గడ్చిరోలి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
- గడ్చిరోలి అహేరి వెంకటేశ్ నేత