Matka movie: మట్కా సినిమాపై మెగా హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

by Anjali |
Matka movie: మట్కా సినిమాపై మెగా హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) తాజా చిత్రం మట్కా(Matka). ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదరుచూస్తున్నారు. కాగా మట్కా ఈ నెల (నవంబరు)14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించాలని అనుకున్నానని.. ఆ క్రమంలో మట్కా సినిమా స్టోరీ తన వద్దకు వచ్చిందని వరుణ్ అన్నారు. ఇలాంటి పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. ఎంతో మంది ఈ హీరో ముందుకొచ్చి కమర్షియల్ మూవీ కాకుండా ప్రయోగాత్మక స్టోరీలతోని ప్రయాణం చేస్తున్నామని అసంతృప్తి వ్యక్తం చేసేవారని అన్నాడు. కాగా ఈ మూవీ వాళ్లందరినీ సంతృప్తిపరుస్తుందని వెల్లడించాడు.

కానీ ఒక సినిమా చేయాలంటే స్టోరీ ఎంపిక విషయంలో చాలా ఆలోచించాల్సి వస్తుందని.. అది మాత్రం కష్టతరమమైన పని అని అన్నాడు. ఎందుకంటే.. సినీ ప్రేక్షకుల అభిరుచులు సీజన్‌లా మారిపోతుంటాయని.. ఏడాది, రెండేళ్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో రిలీజ్ చేసేసరికి సమయం పడుతుందన్నారు. కాగా అప్పుడు జనాలకు మూవీ నచ్చుతుందో లేదో మనకు తెలియదని పేర్కొన్నాడు. కానీ మట్కా మూవీ మాత్రం ప్రజల్ని కథా ప్రపంచంలోకి తీసుకెళ్తోందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ బలమైన వాణిజ్య అంశాలతో తెరకెక్కిన సినిమా అని తెలిపాడు. వాసు ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడని.. మనీ కనిపించగానే ఎలా మారాడని దృష్టిలో ఉంచుకుని నటించాలని చెప్పాడు. స్క్రీన్ పై తనను చూసినప్పుడు వాసు గుర్తు రావాలి కానీ.. ఈ వరుణ్ తేజ్ కాదని తెలిపాడు. ప్రస్తుతం మెగా హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed