- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెగ్నెన్సీ రోజుల్ని మర్చిపోలేక పోతున్నాను.. ఇదొక అందమైన దశ అంటూ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దిశ, సినిమా: కన్నడ నటి హర్షిక పునాచా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ‘ఏడుకొండలవాడా వెంకటరమణ అందరూ బాగుండాలి’ అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అప్పుడిలా ఇప్పుడిలా’ అనే సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మ కన్నడతో పాటు తెలుగు, మలయాళం, తమిళ, కొంకణి, భోజ్‌పురి, కొడవ వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నటుడు భువన్ పొన్నానతో గతేడాది ఏడడుగు వేసింది. అయితే ఈ బ్యూటీ అక్టోబర్ చివరి వారంలో పండంటి ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ ప్రెగ్నెన్సీ రోజుల్ని మర్చిపోలేకపోతున్నా అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా హర్షిక పునాచా తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అందులో ప్రెగ్నెన్సీ ఫొటోలను షేర్ చేస్తూ.. నా జీవితంలోనే చాలా అందమైన దశ ప్రెగ్నెన్సీ. నేను కడుపుతో ఉన్న ప్రతిరోజూ చాలా ఆనందంగా గడిచింది. ఇలా నేను హ్యాపీగా ఉండటానికి బేబీ గర్ల్ కారణం. ఈ షూటింగ్ అయిపోగానే తనకు పాప పుట్టింది అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు నిజంగా ఇదొక అద్భుతమైన ఫీలింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.