- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దిశ,తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో మొదలై పెండింగులో పడిన పలు అభివృద్ది పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం కావాల్సిన నిధులను సైతం విడుదల చేస్తున్నట్టు సమాచారం. అయితే స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకు మాత్రమే ఆ ని ధులను రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచా రం. అయితే ముందుగా క్షేత్ర స్థాయిలో పనులు ఏ మేరకు జరిగాయి? ఎంత మేరకు నిధులు కావాలి? అని రిపోర్టులు తెప్పించుకున్న తరువాతే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది.
దశల వారీగా నిధుల విడుదల
ఆర్థిక వనరుల కొరత కారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చిన సర్కారు దశల వారీగా నిధుల విడుదలకు మొగ్గుచూపుతోంది. అందులో భాగంగా ఈ నెలలో ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇంకా పెండింగ్ లో నిధులు ఉంటే, వచ్చేనెలలో రిలీజ్ చేస్తామని హామీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ ఫండ్ రిలీజ్ మొత్తం స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షణలో జరుగుతున్నట్టు టాక్. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా పెండింగ్ నిధులను రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే నిధుల రిలీజ్ ఆలస్యం కావడంతో చిన్నచిన్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ పనులు చేసేందుకు జంకుతున్నారు. మరింత ఆలస్యం చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో దశల వారీగా పెండింగ్ పనులకు నిధులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.