ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. సర్జరీ కోసం అమెరికాకు.. ఆందోళనలో ఫ్యాన్స్

by Kavitha |
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో.. సర్జరీ కోసం అమెరికాకు.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: హ్యాట్రిక్ హీరో శివ రాజ్ కుమార్(Shivarajkumar) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అతని హెల్త్ అప్డేట్ పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. దీంతో తన అనారోగ్య సమస్య గురించి స్వయంగా శివన్న అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివరాజ్ కుమార్ తన వ్యాధి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను అనారోగ్యంతో ఉన్నాను. నేను అబద్ధం చెప్పను. నేను కూడా మనిషినే. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను. చికిత్స కోసం నాలుగు సెషన్లు ఉన్నాయి. ఇప్పటికే రెండు సెషన్లు పూర్తయ్యాయి.

మరో రెండు సెషన్లు జరగాల్సి ఉంది. శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అమెరికా(America)లో చేయించుకోవాలా.. లేక ఇక్కడ చేయించుకోవాలా.. అని ఆలోచిస్తున్నా. అమెరికాలో చేస్తే నెల రోజులు అక్కడికి వెళ్లాలి’ అని తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారగా.. శివన్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. కాగా ఈయన నటించిన ‘భైరతి రంగల్’(Bhairati Rangal) చిత్రం నవంబర్ 15న విడుదల కానుంది.

Advertisement

Next Story

Most Viewed