ఖాళీ కడుపుతో జ్యూస్ లు తీసుకునే వారు.. వీటి గురించి తెలుసుకోండి!

by Prasanna |
ఖాళీ కడుపుతో జ్యూస్ లు తీసుకునే వారు.. వీటి గురించి తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డైట్ లో భాగంగా చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేసి ఖాళీ కడుపుతో జ్యూస్ తాగుతుంటారు. తాజాగా పిండిన పండ్ల రసం రుచికరమైనది, అలాగే పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అయితే, ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల అనేక దుష్ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వలన మీ పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇది దంతాలను కూడా సున్నితంగా చేస్తుంది. ఏమి తినకుండా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే పళ్లరసం తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది.

అధిక బరువుతో బాధ పడేవారు కూడా ఎక్కువగా జ్యూస్ లు తీసుకోకూడదు. దీనిలో ఉండే కేలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందువల్ల, ఉదయం పూట జ్యూస్ తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. పరగడుపున తాగితే ఎసిడిటీ, కడుపునొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం సరికాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story