తల తిరుగుడు సమస్యతో బాధ పడేవారు వీటిని రోజుకు నాలుగు తీసుకుంటే చాలు..!

by Prasanna |
తల తిరుగుడు సమస్యతో బాధ పడేవారు  వీటిని రోజుకు నాలుగు తీసుకుంటే చాలు..!
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది తల తిరుగుడు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. వీరిలో రక్తపోటు చాలా తక్కువగా ఉండటం వలన ఈ సమస్య వస్తుంది. డ్రై ఫ్రూట్స్‌తో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎండు ద్రాక్ష తినడం వల్ల తక్షణ శక్తిని పొందడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.

ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, బి6 వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఎండు ద్రాక్ష పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ వీటిని తినాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్షను తిని, నీరు త్రాగాలి.

ఇది బలహీనత, తల తిరుగుడు సమస్యకి మాత్రమే కాకుండా, అనేక ఇతర వ్యాధులకు కూడా చికిత్స చేస్తుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. కాబట్టి, రక్తహీనతతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ కనీసం 4-5 ఎండుద్రాక్షలను తీసుకుంటే.. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story