Throat pain : గొంతు సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలను పాటిస్తే చాలు.. ఇట్టే తగ్గిపోతుంది!

by Prasanna |
Throat pain : గొంతు సమస్యలు ఉన్నవారు ఈ  చిట్కాలను పాటిస్తే చాలు.. ఇట్టే తగ్గిపోతుంది!
X

దిశ, వెబ్ డెస్క్ : గొంతు సమస్యలు ఉంటే సరిగా తినలేము.. సరిగా ఉండ లేము. ఏది సరిగా మింగలేము. కఫాన్ని బయటకు కక్కలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. దుమ్ము గొంతులోకి పోయి అది అక్కడే ఉండి పోయి అది కఫంలా తయారవుతుంది. ఇది మనిషిని బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి సమయంలో ఇంటి చిట్కాలను పాటించండి.

గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి

ఒక కప్పు గోరువెచ్చని నీరు తీసుకొని..దానిలో ఉప్పు వేసి నీటిని కలిపి బాగా పుక్కిలించండి. మీ గొంతు బాగా నొప్పిగా ఉన్నప్పుడు మీరు ఇలా చేయండి. ఇది వైరస్ నుంచి కాపాడుతుంది. కఫం సమస్యలు కూడా తగ్గిపోతాయి.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిలో జలుబు, ఫ్లూ ని తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. గొంతు నొప్పిని తగ్గించడానికి ఇది బాగా పని చేస్తుంది. అంతే కాకుండా దీని నుంచి పాలను తయారు చేసి అవి తీసుకుంటే వెంటనే నొప్పి తగ్గుతుంది.

Advertisement

Next Story

Most Viewed