- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీతో పాటు బిస్కెట్లు తినే వారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి
దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది టీతో పాటు బిస్కెట్లు తింటుంటారు. మన దేశంలో ఇదొక అలవాటు లాగా మారిపోయింది. మైదా, గోధుమ పిండి వంటి అనేక రకాల పిండితో చేసిన బిస్కెట్లు సాయంత్రం పూట స్నాక్స్ లా తీసుకుంటారు. కానీ, వీటి వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మైదా అందరికి పడదు ఇది ఆరోగ్యానికి హానికరం. టీతో పాటు బిస్కెట్లు తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..
అధిక బరువు : బిస్కెట్లలో కేలరీలు అధికంగా ఉంటాయి. రెగ్యులర్ గా తీసుకోవడం వలన బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇందులో ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు వెంటనే జీర్ణమయ్యేలా చేస్తాయి. దీని వలన ఆకలి మళ్లీ వేస్తుంది. అందువల్ల, వ్యక్తి ఎక్కువగా తినడం వలన వేగంగా బరువు పెరుగుతారు.
గుండె జబ్బులు : బిస్కెట్లలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి హానికరం. ఈ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి అలాగే బ్లడ్ లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి దీని వలన ఇది గుండె జబ్బులు ఎక్కువవుతాయి.
జీర్ణ సమస్యలు: పిండి పదార్థం జీర్ణక్రియకు మంచిది కాదు. అది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. వీటిలో ఫైబర్ లేకపోవడం వల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.