చలికాలం వచ్చేస్తుంది.. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ యోగాసనాలు నేర్చుకోవాల్సిందే..

by Sumithra |
చలికాలం వచ్చేస్తుంది.. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ యోగాసనాలు నేర్చుకోవాల్సిందే..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : చాలామంది శీతాకాలం వచ్చిందంటే చాలు మోకాళ్ల నొప్పులు, కీళ్లనొప్పులు లేదా ఇతర కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. శీతాకాలంలో చల్లని వాతావరణంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో మోకాళ్ల చుట్టూ కండరాలలో దృఢత్వం, నొప్పిని పెంచుతుంది. ఇలాంటి సమయంలో యోగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుందంటున్నారు యోగా నిపుణులు.

ఈ క్రమంలోనే యోగా గురువులు మాట్లాడుతూ యోగా శారీరక వశ్యతను పెంచడమే కాకుండా కండరాలు, కీళ్లను బలపరుస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా వజ్రాసనం, బాలాసనం, పవన్ముక్తాసనం వంటి ఆసనాలు మోకాళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆసనాలు మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. అంతే కాదు యోగా శరీర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఇది శీతాకాలంలో కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అంతే కాదు యోగా చేయడం ద్వారా శరీంలోని అనేక నొప్పులు, సమస్యలు తొలగిపోతాయని యోగా నిపుణులు చెబుతున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed