రోజుకి 10 నిమిషాలు పరుగెత్తితే .. జరిగేది ఇదే

by Prasanna |   ( Updated:2024-06-02 07:20:11.0  )
రోజుకి 10 నిమిషాలు పరుగెత్తితే .. జరిగేది ఇదే
X

దిశ, ఫీచర్స్: వ్యాయామం, పరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ పరుగెత్తడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రన్నింగ్ చేయడం వలన మీ ఎముకలు, కండరాలను బలంగా చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి వ్యాయామం అని చెప్పొచ్చు. అందుకే రోజుకు కనీసం 10 నిమిషాల పాటు పరుగెత్తడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రన్నింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ చూద్దాం ..

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ శరీరం మొత్తం రిపేర్ అవుతుంది. ఇది పనిదినం సమయంలో మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. రన్నింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామం ఎండార్ఫిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. అవి మీ మెదడును చురుకుగా ఉంచుతాయి. ఇది నిద్రలేమిని దూరం చేస్తుంది.

మీకు జ్ఞాపకశక్తి సమస్యలు ఉంటే.. పరుగెత్తడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తారు. రన్నింగ్ మీ మెదడు కూడా షార్ప్ గా ఆలోచిస్తుంది. అలాగే చెమటలు పట్టినప్పుడు హిప్పోకాంపస్ ను పెంచుతుంది. రన్నింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

Advertisement

Next Story