- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 ఏళ్లుగా కూల్ డ్రింక్ తాగి బతుకుతున్న వ్యక్తి ఈయనే..!
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటికి బంధువులు వచ్చినా.. గెస్ట్, ఫ్రెండ్స్ ఇలా ఎవరు వచ్చినా ముందు మర్యాద పూర్వకంగా కూల్ డ్రింక్స్ ఇస్తుంటాం. అలాగే సమయం, సందర్భానుసారంగా పిల్లలు, పెద్దలు శీతల పానియాలను తాగుతుంటాం. మరి కొంత మంది దాహం తీర్చుకునేందుకు కూడా బాటిళ్లకు బాటిళ్లు లాగించేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి కూల్ డ్రింక్‌నే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇలా ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. దాదాపు దశాబ్ధంన్నరగా దానినే తాగుతూ ఆకలి తీర్చుకుంటున్నాడు. ఇంతకూ ఆయన ఆహారాన్ని ఎందుకు మానేశాడో చూద్దాం..
ఇరాన్‌కు చెందిన ఘోలమ్రేజా అర్దెషిరి జూన్ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడట. అప్పటి నుంచి శక్తిని పొందడానికి పెప్సీ లాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతున్నాడు. దానినే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇలా ఎందుకు అని కారణం అడిగితే.. తన నోటిలో వెంట్రుక ఒకటి అడ్డంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అది కడుపు చివర వరకూ ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని చెబుతున్నాడు. అది లాగుతున్నట్లు.. దాని వల్ల ఊపిరాడనట్లు కూడా అవుతుందట. వైద్యుల్ని సంప్రదించినా ఆ సమస్య ఏంటో వారు కూడా నిర్ధారించలేకపోయారట. ఇక ఆహారం తినలేక రోజుకు మూడు పూటలు కడుపు నిండా కూల్ డ్రింక్స్ తాగి ఆకలి తీర్చుకుంటున్నాడట. ఇలా 16 ఏళ్లుగా ఆయన దానితోనే కడుపు నింపుకుంటుండం గమనార్హం. కానీ అతని వింత అనుభూతికి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియరాలేదు.
Read More: వాతావరణాన్ని మార్చే ‘రాక్ వెదరింగ్’ టెక్నాలజీ.. గ్లోబల్ వార్మింగ్ నివారణ సాధ్యమే!