వన్‌సైడ్ లవర్స్‌గా మిగిలిపోయేది ఈ రాశుల వారే..!

by Anjali |   ( Updated:2023-04-07 09:01:28.0  )
వన్‌సైడ్ లవర్స్‌గా మిగిలిపోయేది ఈ రాశుల వారే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సహజంగా ఎవరైనా ప్రేమలో పడతారు. అందులో సందేహం లేదు. మనం ప్రేమించినా, ఎదుటి వ్యక్తి మనల్ని ఇష్టపడకపోతే చాలా బాధగా ఉంటుంది. ఆ సాడ్ ఫీలింగ్ వారి మనసులో జీవితాంతం ఉండిపోతుంది. అయితే జోతిష్య శాస్త్రం వారి ప్రకారం ఈ రాశుల వారు వన్ ‌సైడ్ ప్రేమికులుగా మిగిలిపోతారట. అవెంటో తెలుసుకుందామా...

* కర్కాటకరాశి...

కర్కాటక రాశి వాళ్లు ఎంతో ప్రేమగా చూసుకోవడంతో పాటు.. చాలా కేరింగ్ కూడా తీసుకుంటారు. వీరంటే తమ భాగస్వామికి ఇష్టం లేకపోయినా.. ఈ రాశి వారు మాత్రం ప్రేమను పంచుతూనే ఉంటారు. వీళ్లు చాలా ఎమెషనల్, సెన్సిటివ్‌ కూడా.

* వృషభరాశి...

ఈ రాశి వారు అనుకున్నవి చేయాలనే మొండిపట్టు పడతారు. తమకు నచ్చినట్లుగా ఉంటారు. చాలా నమ్మకంగా కూడా ఉంటారు. అందువల్ల వీరు ఎక్కువగా వన్ సైడ్ లవర్స్‌గా మిగిలిపోతారు. ఎప్పటికైనా ఒంటరిగా ఉండిపోవాల్సిందేగా అనుకొని స్వంత అవసరాలపైన ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ రాశి వారి జీవితంలోకి వచ్చిన వ్యక్తిని పెద్దగా పట్టించుకోరు.

* ధనుస్సురాశి...

వీరు ఎక్కువగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. సాయం చేసే గుణం కూడా ఎక్కువే. తమ భర్తలకు ఎల్లవేళలా సేవ చేస్తూ.. బాగా కనెక్ట్ అవ్వాలని అనుకుంటారు. కానీ వారి భాగస్వామి పెద్దగా పట్టించుకోరు.


* తులరాశి...

తులరాశి వారు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎక్కువగా గొడవలకు గురవుతుంటారు. ఈ రాశి వారు తమ సంతోషం కన్నా, తన పతి ఆనందానికే ఎక్కువగా విలువ ఇస్తారు. ప్రతి క్షణం వారి గురించే మాత్రమే ఆలోచిస్తారు. వీరిలో చాలా మోహమాట పడతారు.

* మీనరాశి...

మీనరాశి వారు వాళ్ల భాగస్వాముల అవసరాలు తీర్చడానికి అస్సలు వెనకాడరు. వీరు మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతన్నానని భావనలో ఉంటారు. భర్త కోపం, ద్వేషం చూపించినా... వెంటనే మర్చిపోతారు. కానీ ఈ రాశి వాళ్లు చాలా ఎమోషనల్.

ఇవి కూడా చదవండి:

బ్రేకప్ చెప్పిన ప్రేయసి కోసం తీవ్ర వర్షంలో 21 గంటలు.. మోకాళ్లపై కూర్చొని వెయిటింగ్..!

నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం

Advertisement

Next Story

Most Viewed