Allergies: వర్షాకాలంలో అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి

by Prasanna |
Allergies: వర్షాకాలంలో అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వర్షం కారణంగా అలెర్జీతోపాటు తుమ్ములు, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్య అందరిలో వస్తుంది. కాకపోతే కొందరికి చాలా తీవ్రమవుతుంది. దీని వలన పనులకు కూడా అంతరాయం కలుగుతుంది. అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే మీరు తినే ఫుడ్ పై శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్లు, అలెర్జీలను సులభంగా తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని, పనితీరును మెరుగుపరుస్తుంది. సాల్మన్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్ మీ ఆరోగ్యానికి చాలా మంచివి.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి తీసుకోవడం ఇమ్మ్యూనిటీ పవర్ పెంచడానికి సహాయపడుతుంది. ఇది అలర్జీలతో పోరాడుతున్నారు. ఆహారంలో నారింజ, మిరియాలు, బ్రోకలీ, కివి, స్ట్రాబెర్రీలను చేర్చడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. పెరుగు, పులియబెట్టిన ఫుడ్స్ లో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోకపోతే అలర్జీ సమస్యలు తగ్గుతాయి. బాదం, చాక్లెట్, అవకాడోలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అలెర్జీలను తగ్గించడానికి, రోగనిరోధక కణాల పనితీరును పెంచడానికి ఇవి సహాయపడతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed