- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!
దిశ, ఫీచర్స్: మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతూ జనాలను భయపెడుతున్నాయి. దీంతో బయటకు పోవాలంటేనే వణికిపోతున్నారు ఎక్కడ ఎండ వేడికి వడ దెబ్బ తగులుతుందో అని బయటకు వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. పూర్తిగా సమ్మర్ సీజన్ స్టార్ట్ కాకముందే ఎండలు తీవ్రంగా ఉండడంతో ఏప్రిల్, మే లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎండలను తట్టుకునేందుకు పలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యకరమైన, పానీయాలు, ఆహారం తీసుకుంటున్నారు. అంతేకాకుండా కొందరైతే ఎండవేడిని తట్టుకునేందుకు ప్రత్యేక డైట్ కూడా మొదలెట్టారు. ఎండ తగ్గిన తర్వాతనే ఏవైనా పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఉద్యోగం చేసే వారైతే బ్యాగ్‌లో జ్యూస్‌లు పలు రకాల పండ్ల ముక్కలు బాక్స్‌లో పెట్టుకుని మరీ వెళ్తున్నారు. అయినప్పటి ఎండాకాలంలో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతూ జనాలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది బాడీ డీహైడ్రేషన్‌కు గురి కావడం. దీని వల్ల కళ్లు తిరిగినట్లు అనిపించి అక్కడికక్కడే పడిపోతుంటారు. అలాంటి వారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొందరు ఈ సమస్య నుంచి బయట పడలే పోతున్నారు. అయితే ఎంత ఎండలు ఉన్నా కూడా శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే ఈ పండ్లు కచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
*వేసవిలో ఎక్కువగా నీరు కంటెంట్ ఉన్న వాటిని తినాలని నిపుణులు చెబుతుంటారు. అందులో ముఖ్యమైనది పుచ్చకాయ. ఇది వేసవి తాపాన్ని తీర్చడంతో పాటుగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.
* అలాగే ఎండలు స్టార్ట్ అవగానే చిన్నా పెద్ద రోజులో కనీసం రెండు సార్లు అయినా కొబ్బరి నీరు తాగుతారు. అయితే డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే కొబ్బరి నీరు కచ్చితంగా తాగితే ఇందులోని మినరల్స్ శక్తిని అందించి మేలు చేస్తాయి.
* సమ్మర్‌లో తీసుకోవాల్సిన పండ్లలో తర్బుజ ఒకటి. దీనిని చాలా మంది తినడానికి ఇష్టపడరు కానీ ఈ పండు వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే డీహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఎండకు శరీరం పొడిబారకుండా రక్షించుకోవచ్చు.
*బొప్పాయి పండు 80 శాతం వరకు నీరు కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని సమ్మర్‌లో తినడం వల్ల డీహైడ్రేషన్ తగ్గడంతో పాటు చర్మం అందంగా నిగనిగలాడేలా చేస్తుంది.
*నారింజ పండులో ఉండే విటమిన్ సీ శరీరంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది. అందుకే ఎండాకాలంలో రోజుకు కనీసం ఒక్క నారింజ పండును అయినా తినాలని నిపుణులు చెబుతున్నారు.
*పైనాపిల్ తినడం వల్ల నాలుక దురద వస్తుందని చెప్పి చాలా మంది తినడానికి నిరాకరిస్తారు. కానీ దీనికి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
*కివి పండ్లు అప్పటికప్పుడు ఎనర్జీని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల డీహైడ్రేషన్‌కు సమస్య తగ్గడంతో పాటు పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి ఆరోగ్యంగా ఉండవచ్చు.