- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kidneys: కిడ్నీల్లో రాళ్లను కరిగించే వంటింటి ఔషధాలు ఇవే...
దిశ, వెబ్‌డెస్క్ : కిడ్నీల్లో రాళ్ల సమస్య వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొంత మందికి కడుపు నొప్పి ఉంటుంది. నడుము కింది భాగంలో అంటే నడుము దగ్గర నొప్పి ఉంటుంది. దీంతో సమస్య వచ్చిన వారు దానిని తట్టుకోలేకపోతారు. ఈ సమయంలో కూర్చోలేక, పడుకోలేక నరకంగా ఉంటుంది. ఇలాంటి వారికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కరాలు ఉన్నాయి. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సూచించిన ప్రకారం ఈ రెమిడీలు పాటిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
అల్లంతో ఎంతో ఉపశమనం
అల్లంని మనం ఇంట్లో అందరూ వాడతారు. ఎక్కువగా కూరల్లో, టీలలో అల్లంని వేస్తారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కిడ్నీల రాళ్ల సమస్యని కూడా తొలగిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో మంటను కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో ఇవి కీ రోల్ పోషిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని మలినాలను కలిగించే టాక్సిన్స్‌ని బయటికి పంపి కిడ్నీ, లివర్‌ని కాపాడుతుంది.
చెడును పారదోలే త్రిఫల చూర్ణం
ఉసిరి, కరక్కాయ, తానికాయలతో కలిపి చేసిన త్రిఫల చూర్ణం కూడా ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మూత్రం ద్వారా శరీరంలో పేరుకుపోయిన విషపూరిత వ్యర్థాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలకు సహాయపడుతుంది. త్రిఫల చూర్ణాన్ని ఓ గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజూ తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలన్నీ తగ్గి బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
పసుపుతో కిడ్నీ సమస్యలు పరార్
పసుపు కూడా అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్న మూలిక. దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతుంది. అలాగే కిడ్నీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
కొత్తిమేరతో కోటి లాభాలు
కొత్తిమీర కూడా బ్లాడర్, యుటెరెస్‌లోని ఇన్ఫెక్షన్ తగ్గేలా చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకు సమస్య తగ్గుతుంది. కాకపోతే పైన చెప్పిన వాటిని మితంగా తీసుకోవాలి. ఒకదానితో ఒకటి కలిపి తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం. వైద్యుల సూచనల మేరకు వీటిని వినియోగిస్తే ప్రయోజనం ఉంటుంది.
Read More... కొబ్బరి కాయలో నీళ్లు, కొబ్బరి ఎలా ఏర్పడుతుంది..? పరిశోధనల్లో తేలిన నమ్మలేని నిజాలు