మెంతినీటితో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..

by Prasanna |   ( Updated:2024-03-01 11:54:29.0  )
మెంతినీటితో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది మెంతు కూరను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇది కూరగానే కాకుండా, నీళ్లతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీని వలన అనేక రకాల వ్యాధులను తొలగిస్తుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..

మధుమేహం..

మెంతికూర కలిపిన నీటిని తాగడం మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ నీటిని ఉదయాన్నే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఇంట్లో మెంతికూర ప్రధానమైన ఆహారం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి.

కొలెస్ట్రాల్..

మెంతులు శరీరం నుండి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తొలగిస్తుంది. అలాగే మీకు కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే రోజూ మెంతి నీరు తాగండి. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యం

మెంతికూరలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, గుండె జబ్బు రోగులకు చాలా మేలు చేస్తాయి. గుండె సమస్యలు ఉన్నవారు ఆహారంలో మెంతి గింజలను చేర్చుకోవాలి.

చర్మం..

మెంతినీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. మెంతినీటిని మీ డైట్లో చేర్చుకుంటే ముఖంపై మొటిమల సమస్య ఉండదు. ముఖంపై కూడా గ్లాసీ లుక్ వస్తుంది.

జీర్ణ వ్యవస్థ

నానబెట్టిన మెంతి గింజలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అజీర్తి నుండి ఉపశమనం పొందవచ్చు. మెంతికూరలో పీచు ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. రాత్రంతా నానబెట్టిన మెంతి గింజల రసాన్ని తాగండి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.


Read More..

ద్రాక్ష పండ్లు రోజూ తీసుకుంటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Advertisement

Next Story

Most Viewed