- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయోధ్య రామ మందిరంలో ఏ తేదీల్లో ఏ పూజలు జరగనున్నాయంటే?
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కోసం భక్తులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఆలయం ఓపెనింగ్ రోజే డెలివరీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అయోధ్య నూతన రామాలయ వేడుకలు ఏ తేదీల్లో జరగనున్నాయని జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కోసం.. దేవాలయ సిబ్బంది ఏ తేదీల్లో ఏ పూజలు జరగనున్నాయో క్లారిటీ ఇచ్చింది. ఈ నెల (జనవరి) 22న మధ్యాహ్నం 12.29 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
జనవరి 15వ తారీకున రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకెళ్లనున్నారు.16న ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలవ్వగా.. 17న శ్రీరాముని విగ్రహం నగర ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇక 18న వాస్తు పూజ, వరుణ పూజ, ఇతర పూజలు జరుగుతాయి. 19 వ తారీకున యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరగగా.. 20న 81 కలశాలతో పుణ్యవహచనం కార్యక్రమం జరుగుతుంది. ఇక 21న జలాధివాసం పూజ, 22 న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. 24వ తేదీ నుంచి భక్తులను అనుమతించనున్నారని సమాచారం. దీంతో భక్తులు లక్షల సంఖ్యలో హాజరు కానున్నారని తెలుస్తోంది.