మగవారికి వచ్చే క్యాన్సర్స్ ఇవే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

by Jakkula Samataha |
మగవారికి వచ్చే క్యాన్సర్స్ ఇవే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మందిని కలవర పెడుతున్న సమస్య క్యాన్సర్. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మహిళలు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీంతో వైద్యులు క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి త్వరిత గతిన వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అయితే ఆడవారిలోనే క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. కానీ మగవారిలో కూడా కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉందని అంటున్నారు వైద్యులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

మూత్రాశయ క్యాన్సర్, ఇది మగవారిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ ఉన్నవారికి మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావడం, వెన్ను నొప్పి లాంటివి కనిపిస్తాయంట. అలాగే, ప్రోస్టేట్ క్యాన్సర్,స్పెర్మ్‌ను రవాణా చేసే అవయవం ప్రోస్టేట్ గ్రంథి. మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్ర విసర్జన ఎక్కువగా రావడం, మూత్రంలో రక్తం, వీర్యంలో రక్తం, ఎముకల నొప్పి, అంగస్తంభన లోపం, వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు.

అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్,కొలొరెక్టల్ క్యాన్సర్ కూడా మగవారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదంట.ఇందులో కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నవారికి పొత్తికడుపు నొప్పి, మోషన్స్ కావడం, బరువు తగ్గడం లాంటివి కనిపిస్తాయంట.

Advertisement

Next Story