ట్రైన్‌లో చిప్స్‌ తిని ప్యాకెట్ అక్కడే పడేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

by Javid Pasha |
ట్రైన్‌లో చిప్స్‌ తిని ప్యాకెట్ అక్కడే పడేసిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్ : ట్రైన్‌‌లో జర్నీ చేయడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణం. ఇండియన్ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మందికి సేవలు అందిస్తోంది. రవాణా పరంగా ఇబ్బందులు లేకుండా చూస్తోంది. సేఫ్ అండ్ నీట్‌నెస్ విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

జర్నీలో ఉన్నప్పుడు చెత్తా చెదారం పడవేయవద్దనే రూల్ పెట్టడంతోపాటు అందరూ పాటించాలని రైవ్వే శాఖ రిక్వెస్ట్ చేస్తుంది. అయినప్పటికీ అక్కడక్కడా కొందరు ప్యాసింజర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తమ వెంట తీసుకెళ్లిన ఆహార పదార్థాలు, ఖాళీ ప్యాకెట్లు, కవర్లు సీట్ల కింద, కిటికీ పక్కన పడేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు రైల్వే అధికారుల కంటపడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాంటి ఘటనకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం రైళ్లల్లో పాటించాల్సిన పరిశుభ్రతపై ఆగ్రా రైల్వే డివిజన్ అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఇటీవల డివిజన్ పరిధిలోని ఓ ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి తాను వెంట తెచ్చుకున్న చిప్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్స్ తిని ఆ కవర్లను డస్ట్ బిన్‌లో కాకుండా ప్యాజింజర్ సీట్లకింద పడేశాడు. చెకింగ్‌కు వచ్చిన రైల్వే ఆఫీసర్లు ఇది గమనించి అతనికి రూ. 2000 జరిమానా విధించారు. అతనితోపాటు చిప్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాల ప్యాకెట్లు పడేసిన వారందరికీ ఫైన్ వేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘రైళ్లల్లో శుభ్రత పాటించకుంటే మనకే నష్టం. ఇప్పటికైనా పాటించండి’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story