ఈ జూలో మ‌నుషులే బంధీలు.. జంతువులు వాళ్ల‌ను చూస్తాయి! (వీడియో)

by Sumithra |
ఈ జూలో మ‌నుషులే బంధీలు.. జంతువులు వాళ్ల‌ను చూస్తాయి! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః జంతు ప్ర‌ద‌ర్శ‌నశాల అన‌గానే బోనుల్లో ఉంచిన సింహాలు, పులుల వంటి అడవి జంతువులు, వాటిని చూడ‌టానికి గుంపులుగా త‌ర‌లొచ్చే మ‌నుషులు గుర్తుకొస్తారు. అయితే, బోనుల్లో ఉన్న జంతువుల్ని చూసి కొంద‌రు, వాటిని అలా బంధించి ప్రదర్శనలో ఉంచడంపై బాధ‌ను వ్య‌క్త‌ప‌రుస్తారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఈ జంతువులను వాటి సహజ ఆవాసాల నుండి తీసుకొచ్చి, బందిఖానాల్లో పెట్ట‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తారు. వీరంద‌రికీ ఊర‌ట‌నిచ్చే విధంగా, చైనాలో ఒక ప్రత్యేకమైన జంతుప్రదర్శనశాల ఉంది. ఇక్కడ జంతువులు కాదు, మనుషులను బోనుల్లో బంధిస్తారు.

చైనాలోని చాంగ్‌కింగ్ నగరంలోని లెహె లేడు వైల్డ్‌లైఫ్ జూలో జంతువులు స్వేచ్ఛగా విహ‌రిస్తాయి. అయితే, మానుషులు మాత్రం బోనులో బంధీలుగా ఉండి, వాటిని చూడాలి. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు మ‌నుషులున్న బోనుల్ని వెంబడిస్తుంటే, వాటికి తాళం వేయడానికి సంద‌ర్శ‌కులు డబ్బు చెల్లిస్తారు! అంతేనా, ఈ బోను ట్రక్కు కడ్డీలకు ప‌చ్చి మాంసం ముక్కలు కూడా వేలాడ దీస్తారు. తద్వారా, జంతువులు బోనుల‌కు దగ్గరగా వ‌స్తాయి. స‌ర‌దాతో పాటు, ప్ర‌మాద‌క‌రంగా ఉండే ఈ జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల వీడియోను Tansu YEĞEN ట్విట్టర్‌లో షేర్‌ చేసారు. "ఇది మానవ జంతుప్రదర్శనశాల. ఇక్కడ జంతువులు బోనుల్లో ఉన్న ప్రమాదకరమైన మానవులను చూస్తాయి" అని శీర్షిక పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed