ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ ఎర్రటి చెట్లు అద్భుతం చేస్తాయట.. 160 ఏళ్ల క్రితం అవి యూకే అడవుల్లోకి ఎలా వచ్చాయంటే..

by Javid Pasha |   ( Updated:2024-03-14 07:46:16.0  )
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ ఎర్రటి చెట్లు అద్భుతం చేస్తాయట.. 160 ఏళ్ల క్రితం అవి యూకే అడవుల్లోకి ఎలా వచ్చాయంటే..
X

దిశ, ఫీచర్స్ : ఒకవైపు ప్రపంచ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యూకే అటవీ ప్రాంతంలో పెరుగుతున్న జెయింట్ రెడ్‌వుడ్స్ (ఒక రకమైన ఎర్రటి చెట్లు) స్థానిక ప్రజలతోపాటు పర్యావరణ శాస్త్రవేత్తల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఎందుకంటే ఇవి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైగా పెరిగే చెట్లు. పైగా మానవాళి జీవన మనుగడకు అద్భుతం చేస్తాయని నమ్ముతున్నారు. ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, ఆక్సిజన్‌ను కూడా అధికంగా రిలీజ్ చేయడమే కాకుండా భూమి, పర్యావరణం వేడెక్కడాన్ని చాలా వేగంగా అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.

చాలా ఎత్తుగా పెరిగే ‘జెయింట్‌ వుడ్’ చెట్లు కాలిఫోర్నియాలోనే అక్కడక్కడా కనిపించేవి. అయితే 160 సంవత్సరాల క్రితం మొదటిసారిగా విక్టోరియన్లు వీటిని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఫారెస్టులోకి తీసుకొచ్చారని, ఇక్కడ వాటిని పెంచారని ఒక అధ్యయనం పేర్కొన్నది. ప్రస్తుతం యూకేలో 5,00,000 రెడ్‌వుడ్ చెట్లు ఉన్నాయని, కాలిఫోర్నియాలో 80,000 చెట్లు ఉన్నాయని నిపుణులు చెప్తు్న్నారు. కాగా కాలిఫోర్నియాలో ఇవి 90 మీ ఎత్తు వరకు పెరుగుతుండగా, యూకేలో మాత్రం 54.87 మీ ఎత్తు వరకే అధికంగా పెరుగుతున్నాయి. సుమారు 2000 సంవత్సరాల వరకు జీవించగలిగే ఈ చెట్లు పర్యావరణ సమతుల్యతకు అద్భుతంగా యూజ్ అవుతాయని తెలియడంతో వాటిని ఎక్కువగా పెంచాలని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో పెంచడానికి తగిన ప్రణాళికలు అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్టును అడ్డుకోవడంలో ఈ ‘జెయింట్ వుడ్’ అడవుల పెంపకం సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed