రోజూ అదే పని చేస్తున్నాడని భరించలేక.. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య

by Prasanna |
రోజూ అదే పని చేస్తున్నాడని భరించలేక.. భర్తకు విడాకులు ఇచ్చిన భార్య
X

దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో పెళ్లిళ్లకి విలువే లేకుండా పోయింది. చిన్న చిన్న వాటికే విడాకులు వరకు వెళ్లి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇల్లాలు తన భర్త పచ్చళ్ళ డబ్బాలకు మూతలు పెడుతన్నాడన్న ఒక్క కారణంతో విడాకులకు అప్లై చేసింది. ఇది విన్నవారంతా కూడా షాక్ అవుతున్నారు. వామ్మో ఇదొక కారణమా.. దీనికి కూడా విడాకులు తీసుకుంటారా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఈ వార్త హల్చల్ చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఓ యువతి తన భర్తతో తనకున్న సమస్యల గురించి రెడ్డిట్‌లో పోస్ట్ చేసింది. తన భర్త ఊరవేసిన ఆవకాయ పచ్చడి మూతలను ఇంట్లో గట్టిగా మూసి ఉంచాడని, వాటిని తెరవడానికి చాలా ఇబ్బంది పడుతుందని ఆమె చెప్పింది. మూత గట్టిగా ఉంటే.. డబ్బాలో ఉన్న ఆహారం తాజాగా ఉంటుందని ఆమె భర్త మొదట్లో చెప్పాడు. ఈ మూతలు తీయడానికి ప్రతీ సారి పొరుగువారిని అడగాల్సి వస్తుందని చెప్పింది. ఇలా 5 యేళ్ల తరబడి మూతలు తెరవలేక అనేక అవస్తలు పడుతున్నట్లు చెప్పింది. అతను చేసిన తప్పు ఒప్పుకుని సారీ చెప్పినా ఆమె వినలేదు.

భర్త చేసిన పనులకి విసుకు చెందిన ఆమె అప్పటికే విడాకులకు అప్లై చేసింది. వారికి ఉన్న ఓకె ఒక సమస్య డబ్బాల మూతలు బిగుతుగా పెట్టడమేనట. అయితే ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే చేశానని భార్య ఒప్పుకోకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిరోజు పాత్రల మూతలు తీసేందుకు కష్టపడాల్సి వస్తోందని, దాని గురించి తరచూ వాదించుకుంటున్నామని, ఇకపై తన భర్తతో కలిసి ఉండటానికి ఇష్టం పడటం లేదని, అందుకే విడాకులు ఇస్తున్నానని .. ఓ మహిళ కోర్టుకు చేసిన ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story