ప్రంపంచలోనే ది బెస్ట్ లస్సీ ఎదో తెలుసా..

by Sumithra |
ప్రంపంచలోనే ది బెస్ట్ లస్సీ ఎదో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా భారత్‌కు చెందిన బాస్మతి బియ్యం కిరీటం దక్కించుకుంది. అలాగే ప్రపంచంలోని అత్యుత్తమ పానీయాలలో భారతదేశపు లస్సీ నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. మరి ఆ లస్సీ ఎలా తయారు చేస్తారు, ఎందుకంత ఫేమస్ అయ్యిందో తెలుసుకుందాం..

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు మామిడి పండ్లను ఇష్టపడతారు. అయితే మామిడిపండు మాత్రమే కాదు, దానితో చేసిన పానీయాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలోని మ్యాంగో లస్సీ ప్రపంచంలోనే బెస్ట్ డైరీ డ్రింక్ అనే బిరుదును దక్కించుకుంది. మ్యాంగో లస్సీ రుచిలో అద్భుతంగా ఉండడం మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.

మామిడికాయలో ఐరన్‌తో పాటు కాల్షియం, జింక్‌లు ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా లస్సీలో తాగడం వలన ఫైబర్, అనేక విటమిన్లు శరీరానికి అందుతాయి. ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

టేస్ట్ అట్లాస్ జాబితాలో ఇండియన్ లస్సీ

తాజాగా టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన జాబితాలో మ్యాంగో లస్సీ ప్రపంచంలోనే బెస్ట్ డ్రింక్ అనే టైటిల్‌ను దక్కించుకుంది. ఎన్నో రకాల లస్సీలలో, ఈ స్వీట్ మ్యాంగో లస్సీ ది బెస్ట్ అంటూ రుచి అట్లాస్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకుంది. పోటీలో ప్రపంచవ్యాప్తంగా 16 పానీయాలు ఎంపిక కాగా ఇందులో మ్యాంగో లస్సీ మొదటి స్థానంలో నిలిచింది.

స్వీట్ లస్సీ

అలాగే పెరుగు, కుంకుమపువ్వు, ఏలకులతో తయారైన స్వీట్ లస్సీ 4.4 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది. స్వీట్ లస్సీ పంజాబ్ రాష్ట్రంలో చాలా ఫేమస్.

ఉప్పు లస్సీ

అలాగే ఈ పోటీలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తయారు చేసిన నమ్‌కీన్ లస్సీ 3.7 రేటింగ్‌తో జాబితాలో 12వ స్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed