- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నోటి దుర్వాసనను కారణమైనా పదార్థాలు.. తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు!
దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. దాని కారణంగా ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటూ లోలోపల ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది మంచిగా బ్రష్ చేసినప్పటికీ నోటి దుర్వాసన వస్తునే ఉంటుంది. దాంతో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కూడా సరిగా మాట్లాడలేక తడబడుతూ ఉంటారు. నోటి దుర్వాసన రాకుండా ఉండటానికి ఎన్నో చిట్కాలను ప్రయత్నించిన ఎటువంటి ఫలితం ఉండదు. చాలా మంది టూత్ పేస్టులు మారుస్తూ ఉంటారు. అయినా ఎటువంటి ప్రయోజనం కనపడదు. అసలు నోటి దుర్వాసనకు కారణాలైనా పదార్థాలు.. అలా రాకుండా చేసే చిట్కాలు ఇక్కడ చూద్దాం..
నోటి దుర్వాసనకు కారణం అయిన పదార్థాలు:
*వెల్లుల్లి
*ఉల్లిపాయ
*కాఫీ
*ఆల్కహాల్
*నాన్-వెజ్
*పంచదార
*ఛీస్
*ముల్లంగి
*టమాటా
ఈ పదార్థాల వలన కొత్తగా దుర్వాసన రావడమే కాక ఉన్న దుర్వాసన ఎక్కువ కూడా అవుతుంది. అందుకే ఈ పదార్థాలు తినే అలవాటు ఉన్నప్పుడు వెంటనే తగ్గించుకోవాలి. అప్పుడప్పుడు తినవచ్చు. అయితే నలుగురితో కలిసే ముందే వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్.
నోటి దుర్వాసనను తగ్గించే పదార్థాలు:
*ఆపిల్ (గ్రీన్ ఆపిల్ కూడా)
*తులసి ఆకు
*పుదీనా
*అల్లం
*పాలకూర
*పుచ్చకాయ
*చెక్క
*గ్రీన్ టీ
*యాలకులు
*సోంపు
*నీరు
*పాలు
*విటమిన్-C ఉన్న ఫ్రూట్స్
ఈ పదార్థాలను మీరు రోజూ తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి. నోటి దుర్వాసన ఉంటే తగ్గుముఖం పడుతుంది. అంతేకాక దుర్వాసన రాకుండా కూడా సహాయపడతాయి.
(నోట్: కేవలం సలహాలు మాత్రమే.. సూచనలు కావు)