- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినేస్తున్నారా? .. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!
దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే ప్రతిరోజూ సమయానికి తినాలని, తీసుకునే ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల పలువురు ఈటింగ్ డిజార్డర్లతో ఇబ్బంది పడుతున్నారు. ఆకలి వేయకున్నా ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరిక కొందరిలో రుగ్మతగా మారుతోంది. దీంతో అనారోగ్యాల బారినపడుతున్నారు. మరికొందరు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా స్నాక్స్ లాగించేస్తుంటారు. పార్టీలు చేసుకోవడం, బయటి ఫుడ్స్ ఎక్కువ తినడంపై ఆసక్తి చూపుతుంటారు. ఇష్టమైన ఆహారం కనబడగానే ఆకలితో సంబంధం లేకుండా మన మెదడులో డొపమైన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీంతో తినడానికి మొగ్గు చూపుతుంటాం. కానీ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవేంటో చూద్దాం.
2018 స్టడీ ప్రకారం ఆకలి వేయకున్నా తినాలనే కోరికలు, స్లీప్ క్వాలిటీకి మధ్య సంబంధం ఉంది. ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవారు లేదా తక్కువగా నిద్రపోయే వారిలో దాదాపు 60 శాతం మంది రాత్రిపూట ఆకలి వేయకున్నా స్నాక్స్ తినే అలవాటు కలిగి ఉంటున్నారని తేలింది. ఆకలి లేనప్పుడు తరచుగా స్నాక్స్ లేదా నచ్చిన ఆహారం తీసుకునే అలవాటు వల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. ఇక నూనెలో వేయించిన ఆహారాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకేంటే ఈ రిస్క్ మరింత పెరుగుతుంది. క్రమంగా టైప్ 2 డయాబెటిస్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఆకలి లేనప్పుడు తినడం కొనసాగిస్తే బాడీలో కేలరీల పరిమాణం పెరిగి అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. ఇది గుండె జబ్బులు, జీర్ణక్రియ సమస్యలకు కారణం అవుతుంది. అందుకే ఆకలి వేయకపోయినా తినే అలవాట్లను తగ్గించుకోవాలని చెప్తున్నారు. ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.