Alu Manchuria: సూపర్ టేస్టీ ఆలూ మంచూరియా రెసిపీ..!!

by Anjali |
Alu Manchuria: సూపర్ టేస్టీ ఆలూ మంచూరియా రెసిపీ..!!
X

దిశ, వెబ్‌డెస్క్: కామన్‌గానే మంచూరియా అంటే చాలా మందికి ఇష్టం. బయటికెళ్తే చాలు.. ఏమైనా తినాలనిపిస్తే ముందుగా మంచూరియాకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే ఎప్పుడూ రొటిన్ గానే కాకుండా ఈసారి కొత్తగా ఆలుతో మంచూరియాను రెడీ చేయండి. సులువుగా తయారయ్యే ఈ స్నాక్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మరీ తయారీ విధానమెలాగో ఇప్పుడు చూద్దామా..

ఆలూ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు:

రెండు పెద్దల సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకోండి. అలాగే సగం కప్పు మైదా పిండి, ఒవేవేళ కావాలనుకుంటే పావు కప్పు కార్న్ ఫ్లోర్ (ఆప్షనల్)తీసుకోవచ్చు. అరచెంచా కారం, అల్లం ముద్ద, సగం టీస్పూన్ ఉప్పు, డీప్ ఫ్రై కి సరిపడా నూనె.

గ్రేవీ కోసం తీసుకోవాల్సిన పదార్థాలు..

నాలుగు చెంచాల నూనె, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, రెండు చెంచాల టమాటా సాస్, 2 చెంచాల నూనె, 2 చెంచాల ఉల్లికాడల తరుగు, వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా మిరియాల పొడి సన్నటి ముక్కల తరుగు, 1 చెంచా సోయాసాస్.

ఆలూ మంచూరియా తయారీ విధానం..

ముందుగా ఆలూ పైన పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక పాత్రలో వాటర్ పోసి అందులో సాల్ట్ వేసి ఉడికించాలి. బాగా మెత్తగా అయ్యేవరకు ఉంచకూడదు. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, అల్లం ముద్ద, మైదా, కారం, ఉప్పు వేసి హాట్ వాటర్ పోసుకోవాలి. బజ్జీ పిండిలా జారుగా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. మీడియం ఫ్లో లో ఉంచండి.

ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్ని మైదా మిశ్రమంలో ముంచి ఆయిల్ వేయండి. గోల్డ్ కలర్ లోకి వచ్చాక తీసి ఓ బౌల్ లో పెట్టండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచి.. అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాడలు వేసి 10 నిమిషాలు అయ్యాక టమాటా సాస్, మిరియాల పొడి, సాల్ట్, సోయా సాస్ వేసి కలపండి. తర్వాత 2 స్పూన్స్ వాటర్ కార్న్ ఫ్లోర్ తో కలిపి ఉడుకుతున్న సాస్ లో వేయండి. 5 నిమిషాలయ్యాక పక్కకు పెట్టుకున్న బంగాళదుంపల్ని అందులో కలపాలి. లాస్ట్ లో తరిగిన ఉల్లికాడలను వేసుకుంటే టేస్టీ టేస్టీ ఆలూ మంచూరియా రెడీ.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed