భాగస్వామి ఉండగానే మరొకరితో పడక సుఖం.. ఎందుకీ ఆకర్షణ?

by Sujitha Rachapalli |
భాగస్వామి ఉండగానే మరొకరితో పడక సుఖం.. ఎందుకీ ఆకర్షణ?
X

దిశ,ఫీచర్స్: దాంపత్య జీవితం ప్రేమ, గౌరవం, నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుంది. బార్యాభర్తల బంధం బలం అవుతుందా? విచ్ఛిన్నం అవుతుందా? అనేది వీటిపైనే బేస్ అయి ఉంటుంది. లేదంటే పెడదారి పట్టే అవకాశం ఉంది. ఇతరుల ఆకర్షణకు గురయ్యే చాన్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే చాణక్య నీతి ప్రకారం ఇలా అట్రాక్ట్ అయ్యేందుకు నాలుగు ముఖ్య కారణాలు ఉన్నాయి.


1. చిన్న వయసులో పెళ్లి

సాధారణంగా గ్రామాల్లో ఆడ పిల్లలకు పద్దెనిమిది ఏళ్లు ఇలా నిండాయో లేదో అలా పెళ్లి చేసేస్తారు.ఆమె 19, 20 ఏళ్లకు పిల్లలకు జన్మనిస్తుంది. భర్త, అత్తమామ, పిల్లల సంరక్షణ బాధ్యతలు మోయడాన్ని ప్రారంభిస్తుంది. మొత్తానికి 30 నుంచి 35ఏళ్లలోపే జీవితం మొత్తాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్‌తో విసుగెత్తిపోయి ఉన్న వాళ్లకు కొంచెం ప్రేమగా, ఉత్సాహంగా మాట్లాడేవారు దొరికితే వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఆ పరిచయం కాస్తా వివాహేతర బంధంగా మారుతుంది.


2. శారీరక సంతృప్తి

భార్యాభర్తల మధ్య విబేధాలు, గొడవలు వచ్చేందుకు కారణం సెక్సువల్ శాటిస్‌ఫాక్షన్ లేకపోవడం కూడా ఒకటి. కాగా శృంగార జీవితంలో భాగస్వామి దగ్గర శారీరక సంతృప్తి పొందలేని వారు మరో తోడు కోసం వెతికే పనిలో పడుతారు. కొంచెం అట్రాక్టింగ్‌గా కనిపించినా.. వారితో వెంటనే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసేస్తారు.


3. నమ్మకం

దంపతుల నడుమ నమ్మకమే అసలైన పునాది. అది ఒక్కసారి విచ్ఛిన్నమైతే మళ్లీ విశ్వసించడం కష్టమే. ఈ పరిస్థితుల్లోనే భాగస్వామిపై కోపంతో ఇతరులను కోరుకుంటారు. తన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు గుణపాఠం ఈ విధంగా చెప్పాలనుకుంటారు. ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌కు ఓకే చెప్తారు. కానీ ఇలాంటి సిచ్యుయేషన్‌లోనూ పార్టనర్ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందని కాస్త ఆలోచించినట్లయితే.. వారి జీవితం నిండు నూరేళ్లు హాయిగా సాగిపోతుందని అంటున్నారు నిపుణులు.


4. మానసిక ఆనందం

వైవాహిక బంధంలో శారీరక సుఖంతోపాటు మానసిక ఆనందం ముఖ్యం. ఒకరి ఇష్టాలు, అలవాట్లకు మరొకరు గౌరవం ఇవ్వడం.. సంతోష పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా బాండ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. కానీ చాలా సందర్భాల్లో పిల్లలు పుట్టిన తర్వాత భాగస్వామి మీద ప్రేమ తగ్గిపోతుంది. పుట్టిన చిన్నారులకే ప్రాధాన్యతనిస్తూ అసలైన వ్యక్తిని నెగ్లెక్ట్ చేస్తుంటారు. దీంతో కాస్త ప్రేమ కోసం పరితపిస్తూ ఇతరులకు ఆకర్షితులవుతారు.

Advertisement

Next Story

Most Viewed