స్పైడర్ కాటేస్తే పురుషుల్లో అంగస్తంభన

by Anjali |   ( Updated:2023-05-15 12:32:43.0  )
స్పైడర్ కాటేస్తే పురుషుల్లో అంగస్తంభన
X

దిశ, ఫీచర్స్: కొన్ని విషయాలు చాలా వింతగా అనిపిస్తాయి. అలాంటిదే ఈ సాలెపురుగు ఫీచర్ కూడా. అత్యంత విషపూరితమైన బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్ లేదా బనానా స్పైడర్ కాటు వేస్తే.. పురుషుల్లో సుదీర్ఘమైన, బాధాకరమైన అంగస్తంభనలకు కారణమవుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో ఆ వ్యక్తి మరణిస్తాడని ఓ అధ్యయనం నిర్ధారించింది కూడా.

ఆర్మ్‌డ్ స్పైడర్‌గా కూడా పిలువబడే ఈ సాలెపురుగు రెండు అంగుళాల శరీరం, ఆరు అంగుళాల వరకు స్ట్రెచ్ చేసే లెగ్ స్పాన్‌ను కలిగి ఉండి భయంకరంగా కనిపిస్తుంది. దక్షణి అమెరికా ప్రత్యేకంగా బ్రెజిల్‌లో కనిపించే ఈ స్పైడర్స్.. ఉత్తర అమెరికా నుంచి యూరప్‌కు అరటిపండ్ల గుత్తుల నడుమ ప్రయాణిస్తాయి.

అంతేకాదు గూడును నిర్మించుకోకుండా రాత్రుల్లో అటవీ నేలపై ఆహారం కోసం వేటాడే ఇవి.. కీటకాలు, ఇతర సాలెపురుగులు, ఎలుకలు, సరీసృపాలు, ఉభయచరాలతో సహా కొన్నిసార్లు పెద్ద క్రిట్టర్‌లను తింటాయి. అయితే మనిషిని కాటు వేస్తే మాత్రం వాటి విషంలోని శక్తివంతమైన న్యూరోటాక్సిన్ పొత్తికడుపు తిమ్మిరి, అల్పోష్ణస్థితి, అస్పష్టమైన దృష్టి, మూర్ఛలకు కూడా కారణమవుతుంది. ఏకంగా నాలుగు గంటలపాటు సుదీర్ఘ అంగస్తంభనతో పాటు ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి తర్వాత చనిపోతాడని పరిశోధకులు కనుగొన్నారు.

Advertisement

Next Story

Most Viewed