- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైలీ 30 మినిట్స్.. ప్రకృతిని ఆస్వాదిస్తే ప్రయోజనాలెన్నో..
దిశ, ఫీచర్స్: ప్రకృతిని ఆస్వాదించడం అనేది అందమైన అనుభూతితోపాటు ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు నిపుణులు. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్వచ్ఛమైన గాలితో కూడిన శ్వాసను అందించే ‘నేచర్ పిల్’ అంటున్నారు. ఈరోజుల్లో చాలామంది పిల్లలు, పెద్దలు ఒకప్పటిలా వాతావరణాన్ని అనుభూతి చెందడం, ప్రకృతి ఒడిలో సేదతీరడం వంటివి చేయడం లేదు. మైదానంలో కలిసి ఆడుకోవడానికంటే కూడా మొబైల్ గేమ్ ఆడుకోవడంపైనే ఆసక్తి చూపుతున్నారు పిల్లలు. ఇక పెద్దలు కూడా స్ర్కీన్ చూసేందుకు కేటాయించినంత సమయం.. ప్రకృతిని ఆస్వాదించడానికి, పచ్చని మైదనాలు, చెట్లు, పార్కులు ఉన్న ప్రదేశాల్లో స్పెండ్ చేయడానికి కేటాయించరు. వీటన్నింటి ఫలితంగా మనం చాలా కోల్పోతున్నామని పర్యావరణవేత్తలతోపాటు వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు.
ప్రతీ రోజు కేవలం 30 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదించడానికి స్పెండ్ చేసినా చాలా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. బహిరంగ ప్రదేశాలలో, పచ్చని చెట్ల నడుమ ఉండటమనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రేరణ కలిగిస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్తున్నారు. పచ్చటి మైదానంలో వాకింగ్ చేయడం వల్ల మెదడులో స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్‌ను నివారించగలిగే రసాయనాల సాంద్రత పెరుగుతుంది. అలాగే ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వ్యాయామం చేసినప్పుడు మంచి అనుభూతిని పెంచే ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలై ఉత్సాహాన్ని పెంచుతాయి. దీర్ఘాకాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదం చేస్తాయి. అలాగే ప్రకృతిలో 30 నిమిషాల నడక మనలో ఆందోళనను పారదోలి, ఆత్మ విశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
Also Read..
చేయని తప్పుకు 125 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న చెట్టు.. ఎక్కడో తెలుసా..?