పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకునే రుగ్మత.. లోన్లీనెస్‌తో మారుతున్న బ్రెయిన్ యాక్టివిటీస్

by Javid Pasha |
పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకునే రుగ్మత.. లోన్లీనెస్‌తో మారుతున్న బ్రెయిన్ యాక్టివిటీస్
X

దిశ, ఫీచర్స్ : ఓ మ్యూజిక్ ఈవెంట్ జరుగుతున్న చోటికి ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ‘అబ్బ ఈ సంగీతం ఎంత వినసొంపుగా ఉందో’ అంటూ సంతోషంగా ఫీలయ్యాడు మొదటి వ్యక్తి. ఇక రెండో వ్యక్తి స్పందిస్తూ.. ‘ఇక్కడికి ఎందుకు వచ్చామో.. ఈ మ్యూజిక్ వల్ల చెవుల్లో హోరుమంటూ మోత మోగుతోంది. అసహ్యంగా ఉంది’ అంటూ బాధపడ్డాడు. ఇక్కడ మ్యూజిక్ ఈవెంట్.. అందులో వినిపించిన శబ్దం ఇద్దరికీ ఒకటే... కాని ఆస్వాదించడంలో, స్పందించడంలో ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఎందుకిలా?... అంటే అక్కడి పరిస్థితిని రిసీవ్ చేసుకోవడం వెనుక వారి మెదడు కార్యకలాపాలు అలా పనిచేశాయని నిపుణులు చెప్తున్నారు. తీవ్రమైన మానసిక ఆందోళనలు, లోన్లీనెస్‌ ఎక్కువకాలం పాటు అనుభవించడం వంటివి ఈ విధమైన సమస్యకు దారితీసే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తుల మెదడు సమచారాన్ని భిన్నంగా ప్రాసెస్ చేసి, ప్రపంచాన్ని లేదా దృశ్యాలన భిన్నంగా చూసేలా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. అధ్యయనంలో భాగంగా వీరు 18 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సుగల 66 మంది యువకులను రెండు గ్రూపులుగా విభజించారు. వారికి న్యూరో ఇమేజింగ్ పరీక్షలను నిర్వహించారు. ఒకే తరహా కార్యకలాపాలను, పరిస్థితులను ఎలా అంచనా వేస్తారో, ఎలా స్వీకరిస్తారో అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా వారు లోన్లీనెస్‌తో బాధపడేవారి మెదడు కార్యకలాపాలను, అలాగే మిగతావారి బ్రెయిన్ ఫంక్షనల్ పనితీరును ఎనలైజ్ చేశారు.

ఒక సమాచారాన్ని ప్రాసెస్ చేసే విషయానికి వస్తే ఒంటరితనం, ఇతర మానసిక రుగ్మతలు లేని వ్యక్తులు దాదాపు ఒకేలా స్పందిస్తారని, వారు చాలా వరకు సంతోషంగా ఉంటారని, పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, సమాచారాన్ని రిసీవ్ చేసుకోవడంలో ఒకేలా వ్యవహరిస్తారని పరిశోధకులు కనుగొన్నారు. ఇక ఒంటరితనంతో బాధపడేవారు మాత్రం ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిస్థితులను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం, భిన్నంగా రిసీవ్ చేసుకోవడం చేస్తారని, బాధపడేలా వ్యవహరిస్తారని గుర్తించారు. అంటే లోన్లీనెస్ వ్యక్తుల ప్రవర్తనలో మార్పులకు, అనారోగ్యాలకు కారణం అవుతుందని, ముఖ్యంగా మెదడు కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు.

Advertisement

Next Story

Most Viewed