మొక్కలు మాట్లాడుకుంటాయి.. బాధలు పంచుకుంటాయి.. రియల్ టైమ్ టాకింగ్‌ను క్యాప్చర్ చేసిన సైంటిస్టులు (వీడియో)

by Javid Pasha |   ( Updated:2024-05-31 15:06:20.0  )
మొక్కలు మాట్లాడుకుంటాయి.. బాధలు పంచుకుంటాయి.. రియల్ టైమ్ టాకింగ్‌ను క్యాప్చర్ చేసిన సైంటిస్టులు (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : మొక్కలకు ప్రాణం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ అవి పరస్పరం మాట్లాడుకుంటాయని, పర్యావరణ ముప్పును గ్రహించి అలర్ట్ అవుతాయని కూడా సైంటిస్టులు రీసెంట్‌గా గుర్తించారు. పరిశోధనలో భాగంగా సైతామా యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు (Masatsugu) టయోటా నేతృత్వంలోని పరిశోధకుల బృందం మొక్కల కమ్యూనికేషన్‌పై కొంతకాలంగా పరిశోధనలు కొనసాగిస్తూ వస్తోంది.

సైంటిస్టులు ఏం చేశారు?

మొక్కలప్రవర్తనను క్యాప్చర్ చేయడానికి శాస్త్రవేత్తలు ఆకులు, గొంగళి పురుగుల కంటైనర్‌కు అనుసంధానించబడిన గాలి పంపును, ఆవాల కుటుంబానికి (mustard family) చెందిన సాధారణ కలుపు మొక్క అయిన అరబిడోప్సిస్ థాలియానాతో మరొక కంటైనర్‌ను అనుసంధానించారు. అబ్జర్వేషన్ కోసం వీడియో రికార్డ్ అయ్యేలా సీసీ కెమెరాను ఆ మొక్కల పరిసరాల్లో అమర్చారు. అంతేకాకుండా మొక్కలకు బయోసెన్సర్‌ను జోడించారు. అద్భుతం ఏంటంటే.. మొక్కలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్న రియల్ టైమ్ ఫుటేజీని సైంటిస్టులు సక్సెస్ ఫుల్‌గా క్యాప్చర్ చేశారు.

ఎలా మాట్లాడుకుంటాయి?

పరిశోధకుల ప్రకారం.. మొక్కలు పరస్పరం మాట్లాడుకోవడంలో గాలిలోని సమ్మేళనాల (airborne compounds) ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఇవి పొగమంచుతో రౌండప్ అయి ఉంటాయి. అంతేకాక ఒక రకమైన వాసనలు వెదజల్లుతుంటాయి. సమీపంలోని పర్యావరణ ముప్పును, కీటకాలవల్ల సంభవించే ప్రమాదాల గురించి ఇవి సమాచారాన్ని కాల్షియం అయాన్లు, సిగ్నలింగ్ ద్వారా గ్రహించి, గాలి ద్వారా మొక్కలను అలర్ట్ చేస్తాయి. ఇదంతా ఎలా జరుగుతుందో కూడా జపనీస్ శాస్త్రవేత్తలు వీడియోలో రికార్డ్ చేశారు. ఇందులో మొక్కలు ఏరియల్ అలారమ్స్‌ను స్వీకరించడం, వెంటనే ప్రతిస్పందించి కమ్యూనికేట్ చేసుకోవడం కళ్లకు కట్టింది.

కీటకాల ముప్పును కూడా..

పర్యావరణ ప్రమాద హెచ్చరికలనే కాదు, కీటకాలు లేదా ఇతరత్రా దెబ్బతిన్న మొక్కల ద్వారా విడుదలయ్యే అస్థిర కర్బన సమ్మేళనాలకు(VOCs) డ్యామేజ్ కానటువంటి మొక్క ఎలా స్పందిస్తుందో పరిశోధకులు అబ్జర్వ్ చేశారు. ఇవి యాంత్రికంగా లేదా దెబ్బతిన్న (herbivore-damaged) చుట్టు పక్కల మొక్కల నుంచి రిలీజ్ అయ్యే అస్థిర కర్బన సమ్మేళనాలను గ్రహించడం ద్వారా వెంటనే తమకు ప్రమాదం పొంచి ఉందని భావిస్తాయి. ఇతర మొక్కలను, ఆకులను కూడా హెచ్చరిస్తాయి. ఈ విధమైన ఇంటర్‌ప్లాంట్ కమ్యూనికేషన్ మొక్కలను పర్యావరణ ముప్పుల నుంచి రక్షిస్తుందని పరిశోధకులు తెలిపారు.

Advertisement

Next Story