భవిష్యత్తులో AI తో శృంగారం.. మనుషులు అవసరం లేకుండానే ఆ పని..

by Sumithra |   ( Updated:2024-01-24 09:44:11.0  )
భవిష్యత్తులో AI తో శృంగారం.. మనుషులు అవసరం లేకుండానే ఆ పని..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోని ప్రతి ఒక్క జీవి యుక్త వయస్సుకు రాగానే శృంగార కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యకరమైన శృంగారంలో పాల్గొనడం వలన మెదడు చురుగ్గా ఉండటం మాత్రమే కాదు, మనిషి ఆరోగ్యంగా కూడా ఉంటారని పలు నివేదికలు వెల్లడించాయి. కొంతమంది తప్పుడు దోవలో అసురక్షిత శృంగారం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అంతే కాదు కొన్ని జంటలు శృంగార పరమైన సమస్యలు రావడంతో విడిపోయే సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చెక్ పెట్టబోతోందని గతంలో గూగుల్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

అంతర్జాలంలోని అనేక పనులను మనుషులతో పోలిస్తే ఏఐ సులభంగా పూర్తిచేస్తుంది. ఎంతో సులభంగా, వేగంగా, కచ్చితత్వంతో తన టాస్క్ కంప్లీట్ చేస్తోంది. అలాగే భవిష్యత్తులో ఏఐ రోబోలు మనుషులతో కూడా శృంగారం చేస్తాయని చెబుతున్నారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా మరి ఆ వివరాలు తెలుసుకుందాం..

గతంలో గూగుల్ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ మో గవాదత్ ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఏఐ గురించి కొన్ని విషయాలు తెలిపారు. వర్చువల్ రియాలిటీతో మర్చిపోలేని శృంగార అనుభూతిని పొందొంచన్నారు. యాపిల్ విజన్ ప్రో లాంటి ప్రత్యేక హెడ్‌సెట్ లను వినియోగించి లైంగిక అనుభవాలను కలిగించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఏఐ పవర్డ్ బాట్‌ల సహాయంతో నిజమైన సెక్స్ రోబోట్‌లతో కలిసిన భావన కలుగుతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో శృంగారం చేసేందుకు భాగస్వామి ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు. భవిష్యత్తులో ఎక్కువగా ఏఐ ఆధారిత భాగస్వాములే ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఏఐ రోబోలు భవిష్యత్తులో మనిషిలా ఆలోచించి ప్రవర్తిస్తే మరో మనిషి పక్కన లేరనే ఫీలింగ్ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story