నిద్రలో పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

by Javid Pasha |
నిద్రలో పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల సైలెంట్ హార్ట్ ఎటాక్‌తోపాటు నిద్రలో గుండెపోటు రావడం వంటి కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా నలభై ఏండ్లు దాటి, బీపీ, షుగర్ వంటి కలిగి ఉంటే ఈ సమస్యలు ఎదుర్కొనే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయని హృద్రోగ నిపుణులు చెప్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ రిస్క్ ఏర్పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు వివరిస్తున్నారు.

* శరీరంలో కొవ్వుశాతం ఎక్కువగా పేరుకుపోవడం అనేది నిద్రలో గుండె ఆగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ముఖ్యంగా ఇటీవల పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే హై కొలెస్ట్రాల్‌ను నియంత్రించే అలవాట్లు కలిగి ఉండాలి. అందుకోసం ఆహారపు అలవాట్లను, జీవన శైలిని మార్చుకోవాలి.

* అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు గుండెకు రక్త సరఫరాలో ఆటకం ఏర్పడుతుంది. బ్లాక్స్ ఏర్పడతాయి. ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరగడంవల్ల కూడా ఇలా జరుగుతుంది. ఆ సమయంలో గుండెపోటు, స్ట్రోక్ వంటివి రావచ్చు. తరచూ వ్యాయామాలు, ఆరోగ్య కరమైన ఆహార నియమాలు అవసరం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ ఉన్న మితమైన ఆహారాలు నిద్రలో గుండె సమస్యలను నివారిస్తాయి.

* సాధారణంగా బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని చాలామంది వెంటనే గుర్తించలేకపోతారు. ఏదైనా హార్ట్ ఇష్యూ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. కాళ్లు, నడుము, పాదాల భాగంలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడటం వంటి లక్షణాలు కూడా శరీరంలో కొవ్వు ఉందనడానికి నిదర్శనం కాబట్టి అనుమానం రాగానే పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement

Next Story