ఔషధ సమ్మేళనాల గని సముద్రపు పాచి.. ఆధునిక వైద్యంలో విప్లవాత్మక మార్పునకు దోహదం!

by Prasanna |   ( Updated:2023-05-14 06:40:16.0  )
ఔషధ సమ్మేళనాల గని సముద్రపు పాచి.. ఆధునిక వైద్యంలో విప్లవాత్మక మార్పునకు దోహదం!
X

దిశ, ఫీచర్స్ : అనేక రకాల జలచరాలు, మొక్కల జీవ వైవిధ్యానికి నిలయం సముద్రాలు. వీటి గురించి మనకు తెలిసినప్పటికీ ఇంకా తెలియని విషయాలు చాలానే ఉండవచ్చు. అందుకే సైంటిస్టులు తరచూ సముద్రాల గురించిన అధ్యయనాలు, పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సముద్రపు పాచిని(Super seaweed seaweed) మెరుగు పర్చడం లేదా రీసైక్లింగ్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకోవడానికి టెల్ అవీవ్ యూనివర్సిటీ అండ్ ఇజ్రాయెల్ ఓషనోగ్రాఫిక్ అండ్ లిమ్నోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లకు చెందిన సైంటిస్టుల బృందం పరిశోధలు చేసింది. సముద్రపు పాచిని సూపర్‌ ఫుడ్, ఫార్మాస్యూటికల్, కాస్మెటిక్ ఇండస్ట్రీస్‌కు ప్రయోజనం చేకూర్చే మార్గాన్ని డెవలప్ చేసింది. దీనిద్వారా సముద్రపు పాచిలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్లను రెట్టింపు చేయడంలో, దాని నాచ్యురల్ సన్‌స్క్రీన్ క్వాలిటీని మూడు రెట్లు పెంచడంలో, హై మెడికల్ వాల్యూ కలిగిన ప్రొటెక్టివ్ పిగ్మెంట్స్‌ను పది రెట్లు పెంచడంలో విజయం సాధించింది. సముద్రపు ఉత్పాదక ఆహారం ఆరోగ్యానికి, ఔషధ సమ్మేళనాల రంగానికి సహకారం అందిస్తుందని పేర్కొన్నది.

ఎన్నో ప్రయోజనాలు

"మాక్రో అల్గే (macroalgae) అని కూడా పిలువబడే సముద్రపు పాచి, సముద్రంలోని పలు రకాల మొక్కలు దాని తీర ప్రాంతాల పర్యావరణ వ్యవస్థకు దోహద పడుతాయి. కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి పర్యావరణంలోకి ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. అనేక జాతుల చేపలు, అకశేరుకాల కోసం ఆహారంగా, నివాసంగా ఉంటాయి’’ అని పరిశోధకుడు అష్కెనాజీ (Ashkenazi) తెలిపారు. సముద్రపు పాచి మానవులకు ప్రయోజనం చేకూర్చే విభిన్న బయో-యాక్టివ్ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుందని, ఈ విషయం చాలామందికి తెలియదని అతను పేర్కొన్నాడు. ఇంటర్‌టైడల్ జోన్‌లో నివసించే సముద్రపు పాచి లవణీయతలో మార్పులు, ఉష్ణోగ్రత, పోషకాల లభ్యత, సౌర వికిరణానికి (solar radiation) అధికంగా గురవడం వంటి ఎక్స్ ట్రీమ్ స్ట్రెస్ కండిషన్స్‌ను భరిస్తుంది. అయితే మనుగడ కోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన కెమికల్ రక్షణ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది కఠినమైన వాతావరణాలను ఎదుర్కోవడంలో సహాయపడే సహజ సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. రీసెర్చ్ టీమ్ మూడు సముద్రపు పాచి రకాలైన ఉల్వా, గ్రేసిలేరియా, హిప్నియాలను సాగు చేసింది. ఆపై వాటిని హై రేడియన్స్, పోషకాల ఆకలి(nutrient starvation), అధిక లవణీయత వంటి వివిధ ఒత్తిడి పరిస్థితులకు గురిచేసింది. ఈ మార్పులు సముద్రపు పాచిలో విలువైన బయోమెటీరియల్స్ కాన్సర్ ట్రేషన్‌ను ఎలా ప్రభావితం చేశాయో, వాటి ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పరిశీలించారు.

‘‘మేము సరైన సాగు పరిస్థితులను అభివృద్ధి చేశాం. సముద్రపు పాచిలో ఆరోగ్యకరమైన, సహజమైన బయోయాక్టివ్ సమ్మేళనాల స్థాయిలను పెంచడానికి సరికొత్త, శుభ్రమైన పద్ధతిని రూపొందించాం. తప్పనిసరిగా ఆహారం, ఆరోగ్య అనువర్తనాల కోసం అభివృద్ధి చెందుతున్న హెల్త్ ఇండస్ట్రీస్‌లో ఉపయోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘సూపర్ సీవీడ్’ని సృష్టించాం’’ అని పరిశోధకులు తెలిపారు.

సముద్రపు పాచిని ఆక్వాకల్చర్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా వర్తింపజేయడంలో తమ అధునాతన పరిశోధన ఉపయోగపడుతుందని సైంటిస్టుల బృందం విశ్వసిస్తోంది. భవిష్యత్తులో యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బయాటిక్ పదార్థాలు వంటి ముఖ్యమైన వైద్య లక్షణాలను కలిగి ఉన్న అదనపు సహజ పదార్ధాలతో సీవీడ్‌‌ను సరికొత్తగా ప్రొడ్యూస్ చేయవచ్చని భావిస్తోంది. అంతేకాకుండా సముద్రపు పాచి ఆక్వాకల్చర్ పర్యావరణ అనుకూలమైనది కూడా. అదనపు మానవ నిర్మిత పోషకాలు, ఇతర కాలుష్య కారకాలను, గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గిస్తాయి. అందుకే రీసైక్లింగ్‌ను ప్రోత్సహించే టెక్నాలజీ ద్వారా సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా వాటిని ఉపయోగించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

కణాల రక్షణకు దోహదం

సముద్రపు పాచి థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్‌తో సహా అనేక విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. ఇందులో ఇతర పోషకాలతోపాటు విటమిన్లు A, C, E, K, అలాగే ఫైబర్ ఉన్నాయి. అయోడిన్, ఐరన్, కాల్షియం, విటమిన్ B12తోపాటు ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ ఉంటాయి. కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది కాబట్టి సముద్రపు పాచిన తినడంవల్ల ఆరోగ్యానికి మంచిది. ఇందులోని అయోడిన్, టైరోసిన్ వల్ల జీవ క్రియలను నియంత్రించే థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. అలసట, కండరాల బలహీనతలు దూరం అవుతాయి.

గుండె జబ్బుల నివారణకు

కొన్ని అధ్యయనాలు సముద్రపు పాచి బరువు తగ్గడానికి సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ జీర్ణక్రియను సమర్థవంతంగా నిరోధించవచ్చు. సీవీడ్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ వంటి కొన్ని పోషకాలు ఉండటంవల్ల గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. అయితే సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉన్నవారు వైద్య నిపుణుల సూచన మేరకు వాడాల్సి ఉంటుంది.

Also Read..

Sesame Oil: ఈ నూనె వలన మహిళలకు ఎన్ని ఉపయోగాలో తెలుసా?

Advertisement

Next Story