- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మీ క్రియేటివిటీ తగ్గుతోందా?.. పీల్చే గాలివల్ల కూడా కావచ్చు !
దిశ, ఫీచర్స్ : మనం చేసే ఏ పని అయినా సరే.. అట్రాక్టివ్‌గా ఉండాలంటే దానికి క్రియేటివిటీ జోడించాలని నిపుణులు చెప్తుంటారు. అందుకే ప్రతి పనిలో, ప్రతీ రంగంలో సృజనాత్మకతకు నేడు ప్రయారిటీ పెరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో పర్యావరణంలోని విషపూరిత వాయువులు మానవుల క్రియేటివిటీపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అస్థిర కర్బన సమ్మేళనాలు(TVOC) కలిగిన గాలిని పీల్చుకోవడంవల్ల వర్క్‌ప్లేస్‌లలో ఉద్యోగుల క్రియేటివిటీ సామర్థ్యంలో తక్కువ స్కోర్‌లు నమోదువుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
అధ్యయనంలో భాగంగా సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు 87 మంది అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కలిగి ఉన్న ఇండోర్ వర్క్‌స్పేస్‌ను అనుకరించారు. టాక్సిక్ ఎయిర్ వారిని, వారి ప్రతిభను ఎలా ప్రభావితం చేసిందో అబ్జర్వ్ చేశారు. ఈ సందర్భంగా 53 మంది కార్బన్ డయాక్సైడ్, అస్థిర కర్బన సమ్మేళనాల వంటివి కలిగిన గాలని పీల్చడంవల్ల గందరగోళాన్ని అనుభవించడం, పనిలో క్రియేటివిటీ ప్రదర్శించకపోవడం గమనించారు. దీని ఆధారంగా సైంటిస్టులు వర్క్‌ప్లేస్‌లో అధిక అస్థిర కర్బన సమ్మేళనాల స్థాయిలు తక్కువ సృజనాత్మకతో ముడిపడి ఉంటాయని నిర్ధారించారు. అందుకే కాలుష్య వాతావరణం లేదా గాలిలో అస్థిర కర్బన సమ్మేళనాలు అధికంగా ఉండే ప్రాంతాలలోని కార్యాలయాల్లో పని చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరమని సైంటిస్టులు సూచిస్తున్నారు. ముఖ్యంగా టాక్సిక్ ఎయిర్ ప్రవేశించే అవకాశం ఉన్నవైపు విండోస్ క్లోజ్ చేయడం, గాలి నాణ్యతను పెంచే చర్యలను చేపట్టడం వంటివి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు.