రైలు చివరి కోచ్‌పై ‘X’.. ఎందుకుంటుందో తెలుసా..?

by Vinod kumar |
రైలు చివరి కోచ్‌పై ‘X’.. ఎందుకుంటుందో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: మీరెప్పుడైనా రైలు చివరి కోచ్‌ బ్యాక్‌లో ‘X’ అక్షరం ఉండటాన్ని గమనించారా? అది ఎందుకుంటుందో తెలుసా? దీనిపై క్లారిటీ ఇస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. రైల్‌లో జర్నీ చేస్తున్నప్పుడు చివరి కోచ్‌లో వెనుక వైపు పెద్దగా 'X' అనే అక్షరం అర్థం ఏంటంటే.. ఆ రైలు ఎలాంటి కోచ్‌లను వదిలిపెట్టకుండా దాటిపోయిందనే సూచించడానికి వెనుకాల 'X' అని పెయింట్ చేసి ఉంటుంది. పసుపు రంగులో ఉన్న 'X' గుర్తు ఉన్న కోచ్‌ని చూపించే ఒక ఫొటోను కూడా రైల్వే మంత్రిత్వశాఖ షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు ఇప్పటి వరకు 2.2 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. ఇంకా పెరిగే అవకాశం ఉంది.

యూజర్ల స్పందన..

‘‘ఈ విజువల్ ఇండికేటర్ రియల్లీ హెల్ప్‌ఫుల్‌. ఈ 'X' అక్షరం వెనకాల ఉన్న అర్థం ఆసక్తికరంగా ఉంది’’ అని ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. ‘‘సో గుడ్. ఇన్నాళ్లు దాని ప్రియారిటీ తెలీదు. ఇప్పుడు తెలిశాక ఆశ్చర్యపోతున్నా’’ అని మరొకరు పోస్ట్ చేశారు. “గుడ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా పంచుకుంటూ ఉండండి” అంటూ ఇంకో యూజర్ కామెంట్ చేశాడు.

Advertisement

Next Story