Pumpkin Juice: గుమ్మడి జ్యూస్ వల్ల ఆ సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు

by Prasanna |
Pumpkin Juice: గుమ్మడి జ్యూస్  వల్ల ఆ సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు
X

దిశ, ఫీచర్స్ : గుమ్మడి కాయలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. దీని వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అధిక బరువు, అధిక రక్తపోటుతో బాధ పడే వారు రోజు ఈ గుమ్మడి జ్యూస్ ని తీసుకోండి. దీనిలో ఉండే విటమిన్ సి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దీంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

జీర్ణక్రియ

గుమ్మడి కాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ ని ఉదయం పరగడుపున తీసుకోవడం వలన ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గుమ్మడి కాయలో ఉండే విటమిన్ సి ఇమ్మ్యూనిటీ శక్తిని పెంచుతుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోండి. అంతేకాకుండా సీజనల్‌ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

రక్తపోటును నియంత్రిస్తుంది

గుమ్మడి కాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీని రసాన్ని తాగడం వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story