- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. జనవరి ఫస్టురోజే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఇంకెంతో దూరంలేదు. మరికొన్ని గంటల్లో మనమంతా న్యూ ఇయర్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నాం. మనమే కాదు.. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 31 నైట్ నుంచే సెల్రబేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక మరుసటిరోజు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా కొత్త సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. కాగా న్యూ ఇయర్‌లోకి ప్రవేశించే ముందు కొన్ని సందేహాలు కూడా పలువురిని వెంటాడుతున్నాయి. ఏంటంటే.. న్యూ ఇయర్ వేడుకలను మనం జనవరి ఫస్టురోజే ఎందుకు జరుపుకోవాలి?. దీనికి సరైన ఆన్సర్ కావాలంటే మనం ఒకసారి చరిత్రలోకి తొంగి చూడాల్సిందే అంటున్నారు నిపుణులు.
క్రీస్తుపూర్వం 45 ఏండ్ల కిందట జూలియస్ సీజర్ జూలియన్ అనే ఖగోళశాస్త్ర నిపుణుడు క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. కాగా ఆయన భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని బేస్ చేసుకొని దీనిని రూపొందించారు. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. క్యాలెండర్‌ను ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఇలా సంవత్సరం ప్రారంభం రోజును సీజర్ ఎంపిక చేసుకున్నాడు. మరొక విషయం ఏంటంటే.. రోమన్లకు జనవరి నెల చాలా ముఖ్యమైనది. వారు తమ దేవత జనస్ పేరిట ఏర్పడిన నెలగా దీనిని పరిగణిస్తారు. అతనిని ఆది దేవతగా (గాడ్ ఆఫ్ బిగినింగ్స్) భావిస్తారు. కాబట్టి న్యూ ఇయర్ వేడుకకు జనవరి ఫస్టు సరైందిగా సీజర్ అప్పట్లో పేర్కొన్నాడు.
గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా జనివరిలోనే ప్రారంభమైంది. పైగా రోమన్లు జవరి నెలను ఒక ఎనర్జిటిక్ మంత్‌గా భావిస్తారు. ఎందుకంటే అక్కడ ఈ నెల ప్రారంభానికి ముందు పగటి వేళ సమయం చాలా తక్కువగా ఉంటుంది. జనవరిలోనే పగటివేళ ఎక్కువ సమయం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అక్కడ జనవరి ప్రారంభం రోజు అంటే.. 1వ తేదీనే న్యూ ఇయర్ వేడుకకు అనుకూలమైందని భావించారు. కాబట్టి అలా ఆచరణలోకి వచ్చింది. దీంతోపాటు 1752లో యూరప్‌తోపాటు ఇంగ్లండ్ దేశాలు కొత్త సంవత్సరాన్ని జనవరి ఒకటవ తేదీనే జరుపుకోవాలని చట్టం చేశాయి. ఇక వర్తమానం గురించి చెప్పుకుంటే ప్రజెంట్ చాలా దేశాలతోపాటు, ఇండియా కూడా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నాయి. కాబట్టి మనం ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన మాత్రమే న్యూ ఇయర్ సెల్రబేషన్స్ చేసుకుంటాం.