viral video: కోపంతో అరవడానికి, సంతోషంతో నవ్వడానికి రోజుకు రూ.18,500 చెల్లించాలి!

by Javid Pasha |   ( Updated:2024-05-31 09:02:34.0  )
viral video: కోపంతో అరవడానికి, సంతోషంతో నవ్వడానికి రోజుకు రూ.18,500 చెల్లించాలి!
X

దిశ, ఫీచర్స్ : ఫీలింగ్స్, ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. కానీ వాటిని బయట పెట్టడానికి అనేక ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మనసులో ఎంత బాధ ఉన్నా పరుషులు నలుగురిలో ఏడవలేరు. మహిళలు కూడా కోపంతో అరవలేరు. ఇలా తమ భావోద్వేగాలను మనసులోనే దాచుకొని కుమిలిపోవడం వాస్తవానికి అనారోగ్యానికి దారితీయవచ్చు. అయితే అలాంటి పరిస్థితి రానీయకుండా ప్రస్తుతం రేజ్‌ రిచ్యువల్స్(Rage Rituals) అనే ఓ కొత్త ట్రెండ్ అందుబాటులోకి వచ్చింది. వ్యక్తులు తమ ఎమోషన్స్‌ని మేనేజ్ చేయడంలో ఇదెలా ఉపయోగపడుతుందో చూద్దాం.

బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా చాలామంది ఆందోళన, ఒత్తిడి, నిరాశ, డిప్రెషన్ వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. అవసరం అయినప్పుడు తమ భావాలను, భావోద్వేగాలను పంచుకోలేక, వ్యక్తం చేయలేక, మరోవైపు వాటిని మేనేజ్ చేయలేక అవస్థలు పడుతున్నారు. అయితే ఇలాంటి వారి మనసును అర్థం చేసుకొని, భావోద్వేగాల భారాన్ని దించుకోవడానికి ఫ్రాన్స్‌కు చెందిన మియా బాండుచి, మియా మాజిక్ అనే భార్యా భర్తలు ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. తమ స్నేహితులతో కలిసి రేజ్ రిచ్యువల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

నిర్వాహకుల ప్రకారం.. ఎవరైతే కోపం, సంతోషం, బాధ, భావోద్వేగాలను వ్యక్తం చేయలేక లోలోనే అణచి పెట్టుకుంటున్నారో.. వారు రేజ్ రిచ్యువల్ ఈవెంట్స్‌కు అటెండ్ కావచ్చు. ముందుగానే పేరు నమోదు చేసుకోవాలి. పైగా ఈవెంట్స్ అన్నీ అడవుల్లో, ప్రశాంతమైన పర్వత ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. ఈవెంట్లకు హాజరయ్యే వ్యక్తులతో నిర్వాహకులు ముందుగానే మాట్లాడతారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక తమను బాధ పెట్టిన వ్యక్తులను, అంశాలను గుర్తు చేసుకోవాలని, సంతోష కరమైన సందర్బాలతో ప్రేరణ పొందాలని ఇలా ఎవరికి ఏది అవసరమో ఆ విషయాల్లో ప్రోత్సహిస్తారు.

ఈవెంట్‌లో పాల్గొన్న స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఇన్నాళ్లు తమ మనసులో అణచిపెట్టుకున్న కోపం, భావోద్వేగం వంటివి గుర్తు చేసుకొని ప్రదర్శించాలి. అరుస్తూ, నవ్వుతూ, వస్తువులు పగల కొడుతూ, కట్టెలతో నేలపై బాదుతూ ఎలా కంఫర్ట్‌గా అనిపిస్తే అలా వ్యక్త పరుస్తూ బాధలు, భావోద్వేగాలు, ఆవేశం చల్లారే వరకు కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత చాలా రిలాక్స్ అవుతారు.

అయితే ఈవెంట్‌లో పాల్గొనే ప్రతీ వ్యక్తికి రేజ్ రిచ్యువల్ నిర్వాహకులు రూ. $222 (RS 18,500) చార్జ్ చేస్తారు. ప్రజెంట్ ఫ్రాన్స్‌లో ఈ ట్రెండ్ ఫుల్ పాపులర్ అయిపోయింది. రాబోయే ఆగష్టులో దట్టమైన అడవుల మధ్య మరో ఈవెంట్‌కు ఆర్గనైజర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇండియాలో అంత పాపులర్ కాలేదు కానీ, కొన్నాళ్లుగా ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో రేజ్ రూమ్‌లు, బ్రేక్ రూమ్‌లు, డిస్ట్రక్షన్ రూమ్‌లు అందుబాటులో ఉంటున్నాయి. కాకపోతే ఇక్కడ డబ్బులు వసూలు చేయరు.

Advertisement

Next Story

Most Viewed