- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సముద్రంలో హైడ్రో థర్మల్ వెంట్స్.. సరికొత్త పర్యావరణ వ్యవస్థను గుర్తించిన పరిశోధకులు
దిశ, ఫీచర్స్ : సముద్రాలు జీవ వైవిధ్యానికి నిలయం. ఇప్పటికీ మనకు తెలియని రహస్యాలకే కేంద్రంగా ఉన్నాయని నిపుణులు చెప్తుంటారు. అయితే రీసెంట్‌గా ష్మిత్ ఓషన్ ఇన్ స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు సెంట్రల్ అమెరికా పరిధిలోని తూర్పు పసిఫిక్ రైజ్‌లో డార్క్ అగ్నిపర్వత క్రస్ట్ స్లాబ్‌ల కింద ఉన్న రహస్యాలను ఛేదించడానికి రోబోట్‌లను ఉపయోగించారు. ఆశ్చర్యంగా ఇంతరకు ముందెన్నడూ చూడని అనేక జీవజాతులు ఉన్నట్లు వారు గుర్తించారు.
భూగర్భ కుహరాలలో, ఇసుకలో, బురదలో నివసించే అనేక రకాల యానిమల్స్ సముద్రంలో జీవిస్తున్నట్లు మనకు చాలా కాలంగా తెలుసు. కానీ ఫస్ట్ టైమ్ ఎకాలజిస్టులు సముద్రపు అడుగు భాగంలో వేడి నీటితో కూడిన హైడ్రోథర్మల్ వెంట్స్‌ను గుర్తించారు. అంతేకాదు వీటి కింది భాగాన అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను ఉన్నట్లు గమనించారు. ఇది వరకు చూడని రకరకాల పురుగులు, సరికొత్త ఆకారపు నత్తలు, కెమోసింథటిక్ బ్యాక్టీరియాలు, రంగురంగుల పర్యావరణ వ్యవస్థ నిక్షిప్తమై ఉందని తెలుసుకున్నారు. అయితే ఇక్కడ నివసించే జీవులన్నీ సూర్యరశ్మీపై ఆధారపడవు. తమ ఆహారం లేదా ఎనర్జీని పొందడానికి కేవలం ఓషియన్ మినరల్స్‌పై మాత్రమే ఆధారపడతాయని పరిశోధకులు తెలిపారు. 46 ఏండ్ల తర్వాత పసిఫిక్ మహా సముద్రంలో ‘డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్’ కింద ఒక కొత్త పర్యావరణ వ్యవస్థను కనుగొనడం సంతోషంగా ఉందని ష్మిత్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ ఎకాలజిస్టులు అంటున్నారు.