వైన్ తాగితే తలనొప్పి ఎందుకు వస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. అక్కడే సమస్య..

by Nagaya |   ( Updated:2023-11-21 11:57:35.0  )
వైన్ తాగితే తలనొప్పి ఎందుకు వస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. అక్కడే సమస్య..
X

దిశ, ఫీచర్స్: రెడ్ వైన్, డిన్నర్ కాంబినేషన్ రొమాంటిక్‌గా ఉంటుంది. కానీ కొందరికి మాత్రం చుక్కలు చూపిస్తుంది. కొద్ది మొత్తంలో రెడ్ వైన్ తీసుకున్నా.. 30 నిమిషాల నుంచి మూడు గంటల్లోపు తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. దీన్నే ‘రెడ్ వైన్ హెడేక్’ అని పిలుస్తుంటారు. ఇతర ఆల్కహాల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి తలనొప్పి రాని వారు కూడా ఈ హెడేక్ బాధితులు అవుతుంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో కనిపెట్టేందుకు పరిశోధన నిర్వహించిన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్ శాస్త్రవేత్తలు.. రెడ్ వైన్‌లో సహజంగా లభించే ఫ్లేవనాల్ ఇందుకు కారణమని గుర్తించారు.

క్వెర్సెటిన్ అని పిలువబడే ఈ ఫ్లేవనాల్.. ద్రాక్షతో సహా అన్ని రకాల పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్‌గా పరిగణించబడుతుంది. సప్లిమెంట్స్ రూపంలో కూడా లభిస్తుంది. అయితే ఆల్కహాల్‌తో జీవక్రియ చేసినప్పుడు సమస్యాత్మకంగా మారుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది రక్తప్రవాహంలోకి వచ్చినప్పుడు.. శరీరం దానిని క్వెర్సెటిన్ గ్లూకురోనైడ్ అని పిలిచే మరొక రూపానికి మారుస్తుంది. ఈ రూపంలో ఆల్కహాల్ జీవక్రియను అడ్డుకుంటుంది. ఫలితంగా ఎసిటాల్డిహైడ్ అనే టాక్సిన్ పేరుకుపోతుంది. తలనొప్పికి కారణమవుతుంది.

కాగా ఆల్కహాల్ మానేసేందుకు నిపుణులు సూచించే డైసల్ఫిరామ్ మందులు కూడా ఇవే లక్షణాలను కలిగిస్తాయి. సాధారణంగా శరీరంలోని ఎంజైమ్‌ను విచ్ఛిన్నం చేసినప్పుడు శరీరంలో టాక్సిన్ పేరుకుపోవడానికి ఈ డ్రగ్ కారణమవుతుంది. తూర్పు ఆసియా జనాభాలో దాదాపు 40% మంది కూడా ఎంజైమ్‌ని కలిగి ఉన్నారు. ఇది వారి వ్యవస్థలో ఎసిటాల్డిహైడ్‌ను నిర్మించడానికి అనుమతిస్తుంది.

Advertisement

Next Story