- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజు హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటున్నారా?.. అయితే మీకు క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నట్లే..
దిశ, ఫీచర్స్: హెయిర్ స్ట్రెయిటెనింగ్ మ్యాండేటరీ అయిపోయింది. వర్క్, ఎడ్యుకేషన్, పబ్లిక్ ప్లేసేస్, ఫంక్షన్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా సరే జుట్టును అందంగా అలంకరించుకున్నాకే ఇంటి నుంచి కదులుతుంటారు స్త్రీలు. అయితే కెమికల్ హెయిర్ స్ట్రెయిటనింగ్ ప్రొడక్ట్స్ వినియోగించే నల్లజాతి స్త్రీలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది తాజా అధ్యయనం. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్.. 33వేల మంది బ్లాక్ ఉమెన్ హెయిర్ కేర్ హ్యాబిట్స్ పరిశీలించింది. ఏడాదికి నాలుగు సార్లు ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నవారిని.. ఇతరులతో పోలిస్తే రెండు రెట్లు యుటెరైన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.
హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌లోని పారాబెన్స్, థాలేట్స్, ఫ్రాగ్రెన్స్ లాంటి కెమికల్స్ హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేసే ఎండోక్రైన్ సిస్టమ్‌కు అంతరాయం కలిగిస్తాయి. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క అత్యంత సాధారణ క్యాన్సర్ అయిన గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాగా స్ట్రెయిటనర్స్ ఉపయోగించినట్లు తెలిపిన వారిలో 60శాతం మంది నల్లజాతి స్త్రీలు ఉండటం విశేషం. కాగా హెయిర్ స్ట్రెయిట్ మ్యాండేటరీ అయిపోయిందని.. ఇది జీవితాన్ని భారీగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి అందం ప్రమాణాలను కోరుకుంటున్న నల్లజాతి మహిళలను లక్ష్యంగా చేసుకున్న కంపెనీలు.. జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో తరచుగా ఎండోక్రైన్కు అంతరాయం కలిగించే మరియు ఆస్తమా సంబంధిత రసాయనాలను వినియోగిస్తున్నాయి. కానీ ప్రొడక్ట్ లేబుల్‌లో మాత్రం లిస్ట్ చేయబడటం లేదు.
ఇవి కూడా చదవండి: