నెట్‌ఫ్లిక్స్ నుంచి 'బేసిక్ విత్ యాడ్స్' ప్లాన్.. ఏంటి బెనిఫిట్?

by sudharani |
నెట్‌ఫ్లిక్స్ నుంచి బేసిక్ విత్ యాడ్స్ ప్లాన్.. ఏంటి బెనిఫిట్?
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ప్రకటనల ద్వారా సబ్సిడీతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను 12 దేశాల్లో విడుదల చేయనుంది. నవంబర్‌లో ప్రవేశపెట్టనున్న ఈ ప్లాన్ ద్వారా రెవెన్యూ పెంచుకోవడంతో పాటు ఎక్కువ మంది యూజర్లను పొందాలని చూస్తోంది. 'బేసిక్ విత్ యాడ్స్'గా పిలువబడే ఈ సబ్‌స్క్రిప్షన్ ధర యూఎస్‌లో $6.99. ఇది ఆ దేశంలో 'యాడ్స్ ఫ్రీ' బేసిక్ ప్లాన్ కంటే మూడు డాలర్లు తక్కువ. మూడు నెలల్లోనే దాదాపు మిలియన్ సబ్‌స్క్రైబర్లను కోల్పోవడంతో స్ట్రీమింగ్ దిగ్గజం ఈ చర్యలను చేపట్టింది. ముందుగా ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, స్పెయిన్, యూఎస్‌లో ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుంది.

ఈ యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌‌లో థర్డ్ పార్టీ యాడ్స్ కలిగి ఉండటమే కాకుండా వాటి వీడియో నాణ్యతను 720pకి పరిమితం చేస్తుంది. అయితే గంటకు సగటున నాలుగు నుంచి ఐదు నిమిషాల యాడ్స్ ప్లే అవుతాయి. లైసెన్సింగ్ పరిమితుల కారణంగా ఈ నిర్దిష్ట టైర్‌లో పరిమిత సంఖ్యలో ప్రదర్శనలు అందుబాటులో ఉండవని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అంతేకాకుండా యూజర్లు టైటిల్స్‌ను డౌన్‌లోడ్ చేయలేరు. ప్రారంభ సమయంలో ప్రకటనలు 15 లేదా 30 సెకన్ల నిడివిలో ఉంటాయి. ఇవి షోస్, ఫిల్మ్స్‌కు ముందు స్ట్రీమింగ్ సమయంలో ప్లే చేయబడతాయి.

భారత్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది?

నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను మొదట లాంచ్ చేస్తున్న 12 దేశాల్లో భారత్ లేదు. కాలక్రమేణా మరిన్ని దేశాల్లో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇతర భౌగోళిక ప్రాంతాల్లో దాని సేవలతో పోలిస్తే భారత్‌లో కొన్ని చవకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ కలిగి ఉండటం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రిప్షన్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ యాడ్-వెర్షన్ ప్లాన్‌ ఇండియాలో లాంచ్ చేసే విషయంలో స్పష్టత లేదు. అయితే యూఎస్‌లో 'బేసిక్ విత్ యాడ్స్' సబ్‌స్క్రిప్షన్ ధర $6.99 అంటే రూ.575 ఉంది. అయితే భారత్‌లో యాడ్-ఫ్రీ స్టాండర్ట్ ప్లాన్ రూ.499కే(రెండు డివైజ్‌లలో ఒకేసారి యూజ్ చేయొచ్చు) లభిస్తుండగా.. ఈ ధర భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed